తెలంగాణ పై బీజేపీ గురి, కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!
తెలంగాణ పై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. పార్టీలో ని కీలక నేతల మధ్య ఉన్న విభేదాల పైన సీరియస్ గా ఉన్న పార్టీ కొత్త వ్యూహాలు అమలు చేస్తూ.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా నేతల మధ్య విభేదాల పైన ప్రత్యేకంగా చర్యలు ప్రారంభించారు. ఇద్దరు ముఖ్య నేతలతో వేర్వేరుగా చర్చలు చేసారు. కలిసి కట్టుగా పని చేయాలని తేల్చి చెప్పారు. మరి కొన్ని కీలక నిర్ణయాలకు సిద్దమైంది.
తెలంగాణ లో పార్టీ బలోపేతం పైన బీజేపీ నాయకత్వం కొత్త కార్యాచరణ అమలు చేస్తెంది. తాజా గా పార్టీ చీఫ్ తెలంగాణలో పర్యటించారు. ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నేతల మధ్య విభేదాలు పార్టీకి సమస్యగా మారాయని గుర్తించారు. ఇప్పటికే నేతల మధ్య ఐక్యత అంశం పైన హోం మంత్రి అమిత్ షా సహ పలువురు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. అయినా.. మార్పు రాకపోవటం పైన పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. సునీల్ బన్సల్, అభయ్ పటేల్ హైదరాబాద్ లో మకాం వేసినట్లె సమాచారం. ముందుగా బండి - ఈటల మధ్య విభేదాల పైనా చర్చలు చేస్తున్నట్లు పార్టీ నేతల నుంచి తెలుస్తోంది. ఈటెల ఇంటికి నేతలు వెళ్లి.. రాష్ట్రంతో తాజా పరిస్థితుల పైన చర్చ చేసారని సమాచారం.

తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్
పార్టీలో కొంత కాలంగా బండి సంజయ్ - ఈటల రాజేందర్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయం పైన హైకమాండ్ సైతం గతంలో కీలక సూచనలు చేసింది. పలు సందర్భాల్లో పరోక్షంగానూ డైలాగ్ వార్ కొనసాగింది. దక్షిణాది రాష్ట్రాల పైన ఈ సారి ప్రత్యేకంగా గురి పెట్టిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు నేరుగా చర్చలు చేస్తోంది. ఇప్పటికీ మార్పు రాకపోతే.. ఇక చర్యలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ లో రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలను నేరుగా హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రం లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ముందుగా గ్రేటర్ లో జరిగే ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని భావిస్తోంది. దీంతో.. బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications