వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నువ్వా నేనా? వరంగల్ లో బహిరంగసభపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్; కొనసాగుతున్న టెన్షన్!!

|
Google Oneindia TeluguNews

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, వరంగల్ నగరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను నిలిపి వేయాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మళ్లీ బండి సంజయ్ పాదయాత్ర ఆపిన చోటు నుంచి తిరిగి కొనసాగించి, షెడ్యూల్ ప్రకారం వరంగల్లో బహిరంగ సభను 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మరో షాక్ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఆర్ట్స్ కళాశాలలో అనుమతి ఇవ్వకుండా బిజెపికి చుక్కలు చూపిస్తుంది. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరుతామని, షెడ్యూల్ ప్రకారం వరంగల్ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని బిజెపి తేల్చి చెబుతోంది.

Recommended Video

లిక్కర్ విషయంలో స్పందించండి చెప్పుల విషయంలో కాదు... బండి సంజయ్ *Political | Telugu OneIndia
వరంగల్ లో ఉత్కంఠగా మారిన సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

వరంగల్ లో ఉత్కంఠగా మారిన సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ విఫలయత్నాలు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర మొదలయిన నాటి నుండి చోటు చేసుకున్న అనేక పరిణామాలు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ చేసిన ప్రతిఘటనగా కనిపిస్తుంది. ఇక బీజేపీ బలోపేతమైనదని చెప్పుకోవడానికి టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ బండి సంజయ్ శ్రేణులు ముందుకు సాగటం కనిపిస్తుంది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సమయంలో, పోలీసులు రంగంలోకి దిగి బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని నోటీసులు జారీ చేయగా, కోర్టు పోలీసులు జారీ చేసిన నోటీసులను కొట్టివేసి పాదయాత్ర నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

సభ కోసం బీజేపీ మళ్ళీ కోర్టుకు

సభ కోసం బీజేపీ మళ్ళీ కోర్టుకు


దీంతో రెట్టించిన జోష్ తో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించాలని, 27వ తేదీన షెడ్యూల్ ప్రకారం సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిన వెంటనే, ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహించడానికి అనుమతి నిరాకరించారని, ఇది టీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర అని బండి సంజయ్ తో పాటు బిజెపి నేతలు మండిపడుతున్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయించి ఈ సభకు అనుమతి తెచ్చుకుంటామని తేల్చి చెబుతున్నారు.

బండి సంజయ్ ను అడ్డుకోవటానికి టీఆర్ఎస్ వ్యూహాలు

బండి సంజయ్ ను అడ్డుకోవటానికి టీఆర్ఎస్ వ్యూహాలు

బండి సంజయ్ పాదయాత్ర, వరంగల్ లో బండి సంజయ్ నిర్వహించతలపెట్టిన సభను కచ్చితంగా అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్ర చేయకుండా, సభ నిర్వహించకుండా అడ్డుకోవడం కోసం, ఒకవేళ సభ నిర్వహిస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తూ ఏం చేయాలనే దాని పైన కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే బండి సంజయ్ సభను అడ్డుకోవటానికి టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుందని సమాచారం. ఇక ఉద్రిక్తతలకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలలోనూ చర్చ జరుగుతుంది.

 వరంగల్ లో బీజేపీ సభ నిర్వహిస్తుందా? టీఆర్ఎస్ అడ్డుకుంటుందా?

వరంగల్ లో బీజేపీ సభ నిర్వహిస్తుందా? టీఆర్ఎస్ అడ్డుకుంటుందా?

ఇప్పటికే పలువురు వరంగల్ లో చెప్పులు మోస్తున్న బండి సంజయ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నీకు ఇక్కడ ఏం పని ఉందని వస్తున్నావని బండి సంజయ్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో బీజేపీ సభ నిర్వహిస్తే పరిస్థితులు మామూలుగా ఉండబోవని స్పష్టంగా అర్థం అవుతోంది. మరి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని బండి సంజయ్ సభను నిర్వహిస్తారా? వరంగల్ లో బండి సంజయ్ నిర్వహించాలని నిర్ణయించిన సభను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటారా? వరంగల్ వేదికగా టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి మధ్య రేపు ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
BJP vs TRS war continues over BJP public meeting in Warangal. The BJP has decided to approach the court and hold the meeting. The tension will continue with the TRS trying to block the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X