గులాబీ పార్టీలో బ్లాక్ లిస్ట్ గుబులు! సర్వే ద్వారా పనితీరుపై అంచనా, సిట్టింగులందరికీ చాన్స్ కష్టమే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గులాబీ కోటలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. కూడికలు, తీసివేతల కసరత్తు జరుగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నరలోపే సమయం ఉండడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పట్నించే ముందస్తు కసరత్తు మొదలెట్టారు.

నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు.. ఫలితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించే వారి జాబితా పెరిగిపోవడంతో గులాబీ పార్టీ అధినేత వడపోత కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ విజయం ఖాయం...

టీఆర్ఎస్‌ విజయం ఖాయం...

తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. వందసీట్లు గ్యారెంటీ అనే ధీమాలో ఉన్నారు టీఆర్ఎస్ అధినేత. అంతేకాదు, వివిధ సందర్భాల్లో తనను కలుస్తున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఇదే చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతమయ్యాయని, వివిధ వర్గాల ప్రజల్లోకి చొచ్చుకువెళ్లామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని కేసీఆర్ పేర్కొంటున్నారు. అలాగే సిట్టింగు ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం నేతలపై కట్టుదిట్టమైన సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సిట్టింగ్‌లకు ‘బ్లాక్‌లిస్ట్’ ఫీవర్...

సిట్టింగ్‌లకు ‘బ్లాక్‌లిస్ట్’ ఫీవర్...


పనితీరు సరిగాలేని వారు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితాతో ఓ ‘బ్లాక్‌లిస్ట్‌' తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ జాబితాలో కనీసం 20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు, వివిధ వర్గాల ద్వారా తెప్పించుకుంటున్న సమాచారం, నిఘా విభాగాలు అందిస్తున్న నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై గులాబీ దళం అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం ఓకే, ఎమ్మెల్యేలే...

ప్రభుత్వం ఓకే, ఎమ్మెల్యేలే...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు కసరత్తులో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 3 శాతం శాంపిల్స్‌ తీసుకుని సర్వే చేయిస్తున్నారని, మరో పది రోజుల్లోగా ఈ సర్వే పూర్తవుతుందని అంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూల ఫలితాలు వస్తున్నా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చే సరికి కాస్త తేడా ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఈసారి ఎక్కువ శాంపిల్స్‌ తీసుకుంటున్నారని, మండలాల వారీగా కనిష్టంగా మూడు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని చెబుతున్నారు.

ఒక్కో స్థానం నుంచి ఐదుగురు...

ఒక్కో స్థానం నుంచి ఐదుగురు...

2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 సీట్లు గెల్చుకుంది. తర్వాత వివిధ పార్టీల నుంచి 25 మంది గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ వైపు చూశారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరారు. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో స్థానం నుంచి సగటున నలుగురు, ఐదుగురు నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాల కోసం పార్టీ అధినేత కేసీఆర్ వడపోత కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తోంది.

ప్రత్యామ్నాయం తప్పదా?

ప్రత్యామ్నాయం తప్పదా?

వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతోపాటు కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అధినేత రూపొందించిన ‘బ్లాక్‌లిస్ట్'లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కొన్ని జనరల్ స్థానాల నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఎమ్మెల్యేలు కూడా జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు లభిస్తాయని గులాబీ అధినేత ఎంత హామీ ఇస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు తప్పనిసరిని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్ మనసు చూరగొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election Feaver started in TRS it seems. According to the sources, Party Supreme, CM KCR started his filtering work. Regarding this he depend on a survey. On the basis of the survey he is estimating MLAs performance in the respective constituencies. The hopes on Delimitation of the Constituencies were gone into air, in addition, many other party MLAs are joined in TRS, Due to this there is a tough competition to the Sitting MLAs it seems. That is why TRS Supreme KCR keenly observing the performance of the MLAs and some are going to Black List it seems.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి