బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు: మహిళ మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
సంగారెడ్డి: జిల్లాలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలోని ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాద ఘటనలో రాధిక అనే కార్మికులు మృతి చెందింది. విజయ్ కుమార్ యాదవ్, అన్వేశ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, మరో ముగ్గురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారి, పైకప్పు లేచిపోయినట్లు కార్మికులు తెలిపారు.

పరిశ్రమలోని కాయల్స్ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలిపారు. గాయపడినవారిని బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఐడీఏ బొల్లారం పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications