హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి నారాయణ కొడుకు మృతి: హైదరాబాద్ పోలీసులకు బోండా ఉమ సూచనలు

మంత్రి నారాయణ తనయుడు నితీష్ మృతి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎంపీ బోండా ఉమామహేశ్వర రావు హైదరాబాదు పోలీసులకు పలు సూచనలు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రి నారాయణ తనయుడు నితీష్ మృతి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎంపీ బోండా ఉమామహేశ్వర రావు హైదరాబాదు పోలీసులకు పలు సూచనలు చేశారు.

మంత్రి నారాయణ కొడుకు మృతి: విచ్చలవిడితనంపై జేసీ సంచలన వ్యాఖ్యలుమంత్రి నారాయణ కొడుకు మృతి: విచ్చలవిడితనంపై జేసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ పోలీసులకు బోండా ఉమ సూచనలు

హైదరాబాద్ పోలీసులకు బోండా ఉమ సూచనలు

రోడ్డు నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నితీష్, ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలియగానే హైదరాబాదులో ఉన్న బోండా ఉమ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ పోలీసులకు పలు సూచనలు చేశారు.

ప్రమాదాలు తగ్గాయి కానీ..

ప్రమాదాలు తగ్గాయి కానీ..

హైదరాబాదులో గతంలో విపరీతంగా ప్రమాదాలు చోటుచేసుకునేవని, అయితే ఇప్పుడు పోలీసుల చొరవతో యాక్సిడెంట్లు తగ్గాయని బోండా ఉమ అన్నారు. నిషిత్ నారాయణ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో కర్వ్ షార్ప్‌గా ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవన్నారు.

ఇలా సత్ఫలితాలు

ఇలా సత్ఫలితాలు

హైదరాబాదు పోలీసులకు అవసరమైనన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయని, ఆ వాహనాలపై ఎరుపు రంగు లైట్లు ఉన్నాయని, వాటిని ఆన్ చేసి, ప్రతి కూడలిలో ఉంచితే సత్ఫలితాలు వస్తాయని బోండా ఉమ తెలిపారు.

జాగ్రత్తగా ఉండాలి

జాగ్రత్తగా ఉండాలి

రాత్రి 1 గంట నుంచి వేకువ జాము 5 గంటల వరకు పెట్రోలింగ్ పెంచాలని బోండా ఉమ సూచించారు. ప్రధానంగా జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 2, 36 వంటి ప్రాంతాల్లో యువకులు వేగంగా వెళ్లే అవకాశముందని, అలాంటి చోట్ల పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. వాహన చోదకులు కూడా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి ఉంటుందన్నారు.

మెట్రో పాలిటన్ కల్చర్

మెట్రో పాలిటన్ కల్చర్

హైదరాబాదులో అర్ధరాత్రి కల్చర్ ఉందని, కాబట్టి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలని బోండా ఉమ అన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి రాత్రిపూట బయటకు వెళ్లే కల్చర్ ఉందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

English summary
Vijayawada MLA Bonda Uma to Hyderabad police after Minister Narayana son's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X