రియల్టర్ కూతురితో ప్రేమ: చంపేసి శవాన్ని నాపరాయి గనిలో పూడ్చేశారు
తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు.
తాండూరు: తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు. శవాన్ని నాపరాళ్ల గని గుంతలో పాతేపించాడు. నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం ఆదివారం కనిపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్‌కు చెందిన బెస్త యాదప్ప(21), అదే ప్రాంతానికి చెంది న ఓ ధనికుడైన రియల్టర్ వ్యాపారి కూతుర్ని ఆరేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. దీంతో యాదప్పను రియల్టర్ బెదిరించాడు. ఈ వ్యవహారం పంచాయితీ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఎంత చెప్పినా తన కూతుర్ని మరిచిపోవడం లేదని యాదప్పను హత్య చేసేందుకు కిరాయి హంతకులతో రియల్టర్ ఒప్పందం చేసుకున్నాడు. తన వద్ద పని చేస్తున్న డ్రైవర్‌ను తొలగించినట్లు నాటకమాడి యాదప్పతో స్నేహం చేయించాడు. పథకం ప్రకారం ఈ నెల 20న యాదప్పను వాహనంలో బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గని వద్దకు రప్పించాడు. అక్కడ యాదప్ప గొంతు నులిమి హత్య చేశారు.
అతడి మృతదేహాన్ని నాపరాయి గనుల వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు. కాగా, తన కుమారుడు కనిపించడం లేదని యాదప్ప తల్లి నర్సమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, యువకుడిని హత్య చేసిన రోజే భయాందోళనకు గురైన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications