ఓటమి భయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు: దేవుడి సాక్షిగా.. ఓటర్లతో ప్రమాణాలు!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది. ప్రచార పర్వంలో అన్ని పార్టీల నాయకులు దూకుడు పెంచారు. అయితే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు అందుతుంది. బీజేపీ కూడా శక్తి యుక్తులను వెచ్చిస్తూ ఎన్నికల బరిలో పోరాటం చేస్తుంది.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు తమకు కొన్ని నియోజకవర్గాలలో ప్రతికూల పవనాలు వీయటంతో కొత్త తరహా వ్యూహానికి తెరతీశారు. సహజంగా ప్రతీ ఒక్కరికీ దైవ భక్తి ఉంటుంది. దేవుడి ఎదుట ప్రమాణం చేసి ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రమాణాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లతో ప్రమాణాలు చేయిస్తున్నారు. తమకే ఓటు వేస్తామని దేవుడి సాక్షిగా ప్రమాణం చెయ్యాలని వారికి సూచిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఇదే చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ మండలం రాజాల్ పేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు విన్నూతమైన ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో వున్న ముత్యాలమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజాలు చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మూడవ సారి కూడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పూజలు చేశారు.
ఓటమి భయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు.. ఓటర్లతో ప్రమాణాలు..!!#BRS #BRSParty #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaAssemblyElections #TelanganaElection2023 #Oneindiatelugu pic.twitter.com/EmwTrnrQAf
— oneindiatelugu (@oneindiatelugu) November 21, 2023
అనంతరం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్థులతో మూకుమ్మడిగా ముత్యాలమ్మ గుడిలో శంకర్ నాయక్ కే ఓటు వేయాలని ప్రమాణం చేయించారు. ఆపై గ్రామంలో ఇంటింటికి తిరుగుతు స్వీట్, పండ్లు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇక మరోవైపు ఓటర్ల మద్దతు కోసం తంటాలు పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యా నాయక్ కూడా అదే బాటలో వెళ్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ళ గూడెంలో తన గెలుపు కోసం గ్రామ ప్రజలందరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్ ప్రమాణం చేయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు నియోజకవర్గాలలోనూ ఈ తరహా ప్రమాణాల పర్వంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారేమో అన్న భయంతో ప్రమాణాలు చేయిస్తున్నారు అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications