సీఎం రేవంత్ వైఫల్యమే కారణం - హరీష్..!!
మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం వ్యవహారం పైన కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ చర్చ కొత్త మలుపు తీసుకుంది. షాబాద్‌లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పోలీసుల ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకుందని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్‌ఎస్ నేతలు చిన్న పోస్టు పెడితే సాయంత్రానికి అరెస్ట్ చేస్తున్నారని.. సైకోను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్యలు జరిగేవి కాదు కదా అని ప్రశ్నించారు. షాబాద్ కిల్లర్‌ను రేవంత్ సన్నిహితుడే పోక్సో కేసు నుంచి కాపాడారని ఆరోపించారు. రేవంత్ సన్నిహితుడు పోలీసులకు రూ.20 లక్షల లంచం ఇచ్చి రాజ్‌కుమార్‌ను కాపాడారన్నారు. పోలీసులు రేపిస్ట్‌తో కలిసి మద్యం తాగారని మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు ఆలస్యం చేస్తే బెయిల్‌పై వచ్చి హత్యలు చేశాడని ఫైర్ అయ్యారు. పోలీసులను ల్యాండ్ సెటిల్‌మెంట్లకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని హరీశ్ మండపడ్డారు.

సంచలనంగా మారిన ఆరు హత్యలు
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృత దేహం పోలీసులు గుర్తించారు. నరహంతకుడు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మరణించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతని మృత దేహం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఒకే సారి ఆరుగురిని రాజ్ కుమార్ హత్య చేసాడు. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్ కుమార్ హత్యలు చేసిన తరువాత పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణతో పాటుగా బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. పోలీసులు బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లలో సీసీ కెమేరాలను పరిశీలించారు. కొత్తూరు మండలం పంజర్లలో పాయిజన్ తీసుకొని రాజ్ కుమార్ మరణించినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications