రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ, కేంద్రంపై పోరు: ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మొదలైన సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలు లేవనెత్తాలి, ఏం అంశాలపై మాట్లాడాలి అనే విషయంపై కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలు, ముఖ్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

BRS members to skip president speech in parliament: key decisions in BRS parliamentary party meet

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. అలాగే గవర్నర్ల వ్యవహారంపై కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించినట్లు తెలిసింది. కలిసి వచ్చే పార్టీలతో కలిసి పార్లమెంటులో జాతీయ స్థాయి సమస్యలపై గొంతెత్తాలని సూచించారు.

కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+