బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు: ఈడీ

హైదరాబాద్: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

సంతోశ్ శ్యాండ్, సంతోశ్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది. మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఈ సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

BRS MLA Mahipal Reddy Rs 300 crore mining irregularities ED announcement

మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ పేర్కొంది.

మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని ఈడీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో లావాదేవీలనూ ఈడీ గుర్తించింది. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఈడీ అధికారులు.. సోదాలు కొనసాగిస్తున్నారు.

ఒక్క తప్పూ చేయలేదంటూ హరీశ్ రావు

కాగా, ఈడీ దాడులపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని ఆరోపించారు. మహిపాల్ రెడ్డి నివాసంలో కనీసం డబ్బు, బంగారం కానీ అక్రమంగా దొరకలేదని చెప్పుకొచ్చారు. ప్రతిదీ ఐటీ రిటర్న్స్‌తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయన్నారు. ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+