కవిత- 10 గంటల ఈడీ విచారణ అనంతరం..!!

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఆమెను విచారించారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి కిందటే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు.

హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఇవ్వాళ దేశ రాజధానిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఆమెను విచారించడం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. దేశ రాజధానిలో కవిత విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు సాగిన ఈ విచారణ చివర్లో ఆమె అడ్వొకేట్ కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కొద్దిసేపటి కిందటే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. 10 గంటల పాటు విచారణ అనంతరం బయటికి వచ్చిన వెంటనే నేరుగా టీఎస్ 10 ఈకే 6666 నంబర్ గల కారులో తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. విచారణను ముగించుకుని బయటికి వచ్చిన తరువాత ఆమె అక్కడే ఉన్న విలేకరులతో మాట్లాడతారని తొలుత భావించారు. అలా జరగలేదు. నేరుగా ఆమె తన నివాసానికి చేరుకున్నారు.

కవిత నివాసం వద్ద అప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే తుగ్లక్ లోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఇష్ట పడలేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ కవిత సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

కవితను విచారిస్తోన్న సమయంలో ఈడీ అధికారులు ఆమె అడ్వొకేట్‌ ను తమ కార్యాలయానికి పిలిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 6:30 గంటల సమయంలో కవిత అడ్వొకేట్ సోమా భరత్‌కుమార్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవిప్రసాద్‌, తదితరులు ఉన్నారు. సోమా భరత్ కుమార్ ఒక్కడే ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. మిగిలిన వారు లోనికి వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు.

BRS MLC K Kavitha leaves the ED office after she was questioned 10 hours in Delhi liquor scam

మరోవంక- ఈడీ అధికారుల విచారణను నిలిపివేయాలని కోరుతూ కవిత- సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటీషన్ ఈ నెల 24వ తేదీన విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అంతకంటే ముందుగానే దీన్ని లిస్టింగ్ చేయాలంటూ కవిత చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+