అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం.. కవిత ఆధ్వరంలో బీఆర్ఎస్ ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల వినూత్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల నాడు ప్రారంభమైన నిరసన పర్వం నేటికి కొనసాగుతోంది. రోజుకు ఒక అంశం పైన నిరసన వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ సభ్యులు రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు.
బీఆర్ఎస్ ఆందోళనల పర్వం
నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ రేవంత్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. అప్పులు ఆకాశంలో ఉంటే, అభివృద్ధి పాతాళంలో ఉంది అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తుందేమీ లేదని స్పష్టం చేశారు.

హామీల మాటేంటి
గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 58 వేల కోట్ల రూపాయల అప్పు చేసింద,ని ఇంత అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారో చెప్పాలన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది వృద్ధులకు 4000 రూపాయలు పింఛన్ ఇచ్చారు అంటూ రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
రైతులతో కలిసి బిఆర్ఎస్ నేతల ధర్నా
ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో సాగునీరు అందక చేతికొచ్చే పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన వరి కంకులతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వి ఎస్ ఆర్ నగర్ వద్ద రైతులతో కలిసి బిఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు.
సాగునీరు లేక ఎండుతున్న పంటలు
సాగునీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను ఈ ప్రాంతాలకు తరలించి సాగునీటిని అందించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలతో సాగునీటికి తాగునీటికీ ఇబ్బంది లేకుండా చూశారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications