అసెంబ్లీ సమావేశాల తొలినాడే బీఆర్ఎస్ రచ్చ.. మాజీమంత్రి హరీష్ వార్నింగ్!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఊహించని విధంగా రాష్ట్రంలో యూరియా కొరత పై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీలో యూరియా కొరత పైన మొదట చర్చ జరపాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
తొలిరోజు శాసనసభా సమావేశాలు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా శాసన సభ మొదటి రోజు, జూబ్లీ హిల్స్ సిట్టింగు సభ్యులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల సంతాప తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని అన్ని పక్షాలూ సమర్ధించాయి. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్నీ తీవ్ర విచారాన్నీ తెలియజేస్తూ, సభ్యులు రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.

కాళేశ్వరం నివేదికపై చర్చకు ప్రభుత్వం రెడీ.. కొత్త ఎత్తుగడతో బీఆర్ఎస్
అయితే ప్రభుత్వం జస్టిస్ పి సి ఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఈ సెషన్ లో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరాడనివ్వకుండా చేసేందుకు రాష్ట్రంలో యూరియా కొరత పైన ప్రధాన ఎత్తుగడతో బీఆర్ఎస్ రెడీ అయింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద యూరియా కొరత పైన బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది.
ఖాళీ యూరియా బస్తాలతో వినూత్న నిరసన తెలిపిన బీఆర్ఎస్
అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ నాయకులు గణపతి బప్పా మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు యూరియా సంక్షోభానికి కారణం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పండగ పూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని తీవ్ర విమర్శలు గుప్పించారు.
యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తరువాత మరోమారు యూరియా కొరత పైన నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ లో వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీ సమావేశాలలో యూరియా కొరత పైన చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామని ఆయన అన్నారు.
యూరియా కొరతపై చర్చ పెట్టేదాకా అసెంబ్లీని స్తంభింపజేస్తామన్న మాజీమంత్రి హరీష్ రావు
గతంలో తమ ప్రభుత్వ హయాంలో యూరియా సమస్య లేదని అదనంగా 25 శాతం బఫర్ స్టాక్ పెట్టే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆయన అన్నారు. యూరియా కొరత పైన చర్చ పెట్టేదాకా వదిలిపెట్టేది లేదని అసెంబ్లీని స్తంభింప చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications