కంగ్రాట్స్ రాహుల్ - ఢిల్లీ ఫలితం వెనుక..!!
Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 27 ఏళ్ల తరువాత బీజేపీ తిరిగి ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. వరుసగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయంతో బీజేపీలో జమిలి చర్చ వేళ జోష్ పెరిగింది. కాగా, కాంగ్రెస్ సారధ్యం వహిస్తున్న ఇండియా కూటమిలో నిస్తేజం కనిపిస్తోంది. ఆప్ - కాంగ్రెస్ వేర్వేరు గా పోటీ చేయటం ఫలితం ఢిల్లీలో స్పష్టమైంది. ఇదే సమయంలో రాహుల్ కు కంగ్రాట్స్ చెబుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం ఖాయమైంది. ప్రస్తుతం బీజేపీ 46, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. మేజిక్ ఫిగర్ 36 స్థానాలు దాటిన బీజేపీ మెజార్టీ పైన కన్నేసింది. ఈ విజయం పై బీజేపీ తొలి నుంచి ధీమాగా ఉంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర లో విజయం సాధించిన బీజే పీ.. ఇప్పుడు ఢిల్లీలోనూ సత్తా చాటింది. అదే సమయంలో కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో సతమతం అవుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఢిల్లీలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోకపోవటం మానిసికంగా ఆ పార్టీ నేతల పైన ప్రభావం చూపుతోంది.

Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
— KTR (@KTRBRS) February 8, 2025
Well done 👏 https://t.co/79Xbdm7ktw
ఇప్పుడు ఢిల్లీ ఫలితాల పైన కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో బీజేపీని గెలిపించినందుకు రాహుల్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసారు. బీజేపీని కాంగ్రెస్ మరోసారి గెలిపించందని వ్యాఖ్యానిస్తూ పోస్టు చేసారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ మూడో స్థానినికే పరిమితం అయింది. బీజేపీ, ఆప్ మధ్య 5 శాతం ఓట్ షేర్ తేడా ఉంది. కాగా, కాంగ్రెస్ కేవలం 6.70 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. కేజ్రీవాల్ సైతం గెలుపు కోసం పోరాటం చేస్తున్నారు. మనీశ్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ఫలితాల వేళ రాహుల్ పై కేటీఆర్ ట్వీట్ రాజకీయంగా వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications