మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు - కేటీఆర్ సంచలనం..!!

కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్ పైన విపక్ష పార్టీలకు అస్త్రంగా మారింది. అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన విపక్ష నేత లు స్పందిస్తున్నారు. సురేఖ సైతం కాంగ్రెస్ లోనే ఉంటానని చెబుతున్నా.. ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో సురేఖ వ్యవహారం పైన కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇచ్చారు.. ఒక్కటంటే ఒక్కటి అమలు కూడా చేయలేదని అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలో పాల్గొన్నారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని డైలాగులు కొట్టారు.. 1000 రోజులు అయిపోయింది.. 100 రోజులకు 10 రెట్లయింది.. ఏం చేసారంటే సమాధానం లేదన్నారు. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా.. మీరా అంటూ ప్రశ్నించారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
brs-working-president-ktr-reacts-over-action-against-konda-surekha-targets-cm-revanth-govt

కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తాం

పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆరోపించారు. కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మీ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజు దగ్గరలో ఉందని కేటీఆర్ హెచ్చరించారు. 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలిస్తాం.. అని మా తమ్ముళ్లు, చెల్లెళ్లను మోసం చేసి వాళ్లు పోయి వాళ్ల తల్లిదండ్రులు, అత్తామామలు, తాత నాయినమ్మల కాళ్లు మొక్కేటట్టు చేసి కాంగ్రెస్‌కు ఓటేయించుకుని మోసం చేసినందుకు, బాండ్ పేపర్ రాసి మోసం చేసిన సన్నాసులకు తప్పకుండా భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పైన తమ పోరాటం కొనసాగుతుందని.. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+