వర్షాలు: వరంగల్‌లో భూమిలో నుంచి గాలి, బుడగలు

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ములుగు మండలం రామచంద్రాపురంలోని ఊరచెరువులోనుంచి గాలి బుడగలు వచ్చాయి. ఇటీవల ఓ రైతు వ్యవసాయ భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వాటిని మంగళవారం భూగర్భ శాఖ అధికారులు పరిశీలించారు.

అధిక వర్షాలకు గాలితో పాటు నీరు కూడా భూగర్భంలోకి చేరిందని, ఈ గాలి భూమి పొరలలోని గాలికి తోడై బయటకు వస్తున్నట్లు చెప్పారు.

Bubbles from Underground

ఈ ప్రాంతంలో సున్నపు గుణం కలిగిన డోలమైట్ రాయి ఉందని, కాల్షియం భూమిలోకి వచ్చిన నీటితో కలిసి రసాయన ప్రక్రియ జరిగిందని, తద్వారా రాయి కరిగి, ఖాళీ ప్రదేశం ఏర్పడి అందులోకి గాలి చేరిందన్నారు. ఆ గాలి బయటకు వస్తోందని చెప్పారు. బుడగలు అదే పద్ధతిలో వస్తున్నాయన్నారు.

ఆ పొలంలో నీరు ప్రవహిస్తున్నట్లు శబ్ధం రావడంతో అధికారులు పరిశీలించారు. భుగర్భంలో జలధారలు ప్రవహిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+