తెలంగాణలో మరో ఉప ఎన్నిక, ముహూర్తం..!?
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ మూడు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ఈ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందరికంటే సీఎం రేవంత్ కు మున్సిపల్ ఫలితాలు సమర్థతకు పరీక్షగా నిలుస్తు న్నాయి. కాగా.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తరువాత తెలంగాణలో మరో ఉప ఎన్నిక దిశగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి దాదాపు ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఫలితాల తరువాత అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇందు కోసం అధికార కాంగ్రెస్ సిద్దం అవుతోంది. మున్సిపల్ పోరు పూర్తయిన వెంటనే ఈ ఉప ఎన్నిక దిశగా వేగంగా నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పది మందిని విచారించిన స్పీకర్ ఎనిమిది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. మరో ఇద్దరు నేతల విషయంలో మాత్రమే విచారణ పెండింగ్ లో ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను విచారించారు. వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది. దానం కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయటంతో.. ఆయన పైన వేటు తప్పదనే చర్చ కొనసాగుతోంది. దీంతో, దానం నాగేందర్ తో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లే ఆలోచన ఖరారైనట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఫలితాల తరువాతే నిర్ణయం
ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ తుది నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం పెండింగ్ అనర్హత పిటీషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. మరో మూడు వారాలు గడువుగా నిర్దేశించింది. ఆ గడువు ఈ నెల మూడోవారానికి పూర్తి కానుంది. మరో వైపు రేపు (బుధ రం) జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. దీంతో ఆ తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ ఇందుకు సిద్ధంగా ఉంది. 2023 ఎన్నికల తర్వాత వరసగా హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్, జూబ్లీ ల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. దీంతో.. మున్సిపల్ ఫలితాలకు అనుగుణంగా ఉప ఎన్నిక పైన తుది నిర్ణయం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications