రేవంత్ అలా చేస్తే, నాది అనవసరం: తన రాజీనామాపై తలసాని షాకింగ్ మెలిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గత ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని అప్పుడే రాజీనామా చేశారు. అది స్పీకర్ వద్ద ఉంది.

రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం, ఇరకాటంలో టీడీపీ: బాబుపై జగన్‌కు ఛాన్స్

 రేవంత్ ఏం చేస్తారు?

రేవంత్ ఏం చేస్తారు?

ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందే ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు లేఖ పంపించడమా లేక రేవంత్ మళ్లీ రాజీనామాను స్పీకర్‌కు ఇస్తారా చూడాలి.

 రేవంత్ రాజీనామా చేస్తే ఎన్నికలు

రేవంత్ రాజీనామా చేస్తే ఎన్నికలు

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని... రేవంత్ రాజీనామా అంశంపై తాను మాట్లాడనని చెప్పారు. ఆయన స్పీకర్‌కు రాజీనామా ఇస్తే కనుక ఎన్నికలు తప్పవని చెప్పారు. ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు.

రాహుల్ వచ్చి కూర్చున్నా ఏం కాదు

రాహుల్ వచ్చి కూర్చున్నా ఏం కాదు

కొడంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగితే అన్ని పార్టీలు పోటీ చేస్తాయని తలసాని అన్నారు. అప్పుడు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో కూర్చున్నా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏదీ లేదని చెప్పారు.

 తన రాజీనామాపై తలసాని మెలిక

తన రాజీనామాపై తలసాని మెలిక

తన రాజీనామాపై మాత్రం తలసాని శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరినప్పుడు రాజీనామా చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమైందని తెలిపారు. కాబట్టి తన రాజీనామా ప్రస్తావన అనవసరమని చెప్పారు.

తలసాని ఎందుకు అలా అన్నారంటే

తలసాని ఎందుకు అలా అన్నారంటే

కాగా, ఓటుకు నోటు కేసుకు ముందు, ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. నాడు ఎర్రబెల్లి దయాకర రావు టీడీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరినప్పుడు టీడీపీని విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. దీనిపై రేవంత్ పోరాటం చేశారు. ఇప్పుడు రేవంత్ తాను రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాబట్టి ఆయన రాజీనామా ఆమోదిస్తారని తలసాని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Talasani Srinivas Yadav on Thursday said that by elections in Kodangal are must in Revanth Reddy give resignation letter to Telangana Speaker.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి