సుప్రీంకోర్టు జోక్యం.. తిరిగి తెరుచుకున్న రెస్టారెంట్..!!

హైదరాబాద్ అంటేనే భోజనప్రియులకు ముందుగా గుర్తుచ్చేది ఇరానీ ఛాయ్, ధమ్ బిరియానీ. హైదరాబాద్ బిరియానీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఒక్కో రెస్టారెంట్ ఒక్కో స్టయిల్‌లో బిర్యానీని తయారు చేస్తారు. ఎవరి సొంత రెసిపీతో బిర్యానీ చేయడం వల్ల కస్టమర్లు తరుచూ ఆ హోటల్‌కే వెళ్లి తింటుంటారు. ఇక బిర్యానీ తిన్న తర్వాత ఒక ఇరానీ ఛాయ్ పడితే ఆ మజానే వేరు. ఇక హైదరాబాద్ పాపులర్ రెస్టారెంట్ల విషయానికొస్తే బావర్చి, షాగౌస్, షాదాబ్, కేఫ్ బాహర్,మెహిఫిల్,పిస్తా హౌజ్‌లాంటివి ముందువరుసలో ఉంటాయి. ఇక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేఫ్ బాహర్ రెస్టారెంట్ గత ఐదు దశాబ్దాలుగా ఇరానీ ఛాయ్, బిర్యానీ భోజనప్రియులకు అందిస్తోంది. ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ రెస్టారెంట్ గత నెలరోజులుగా మూతబడింది. కోర్టుల జోక్యంతో తిరిగి తెరుచుకుంది.

హైదరాబాదులోని కేఫ్ బాహర్ రెస్టారెంట్ గత నెలరోజులుగా మూతపడింది. దీంతో చాలా మంది భోజనప్రియులు ఇక్కడ వండి వడ్డించే బిర్యానీకి దూరమయ్యారు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తలెత్తడంతో అది ఆస్తుల వరకు వెళ్లింది. ఇందులో భాగంగానే కేఫ్ బాహర్ రెస్టారెంట్‌ మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఈ రెస్టరెంట్ ఉన్న చోట కస్టమర్ల సందడి కరువయ్యింది. కానీ సోమవారం మాత్రం కేఫ్ బాహర్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. హోటల్ కస్టమర్లతో కిటకిటలాడింది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు కేఫ్ బాహర్ రెస్టారెంట్ తిరిగి ప్రారంభమైందన్న వార్త దావనంలా పాకడంతో సిటీ నలుమూలల నుంచి బిర్యానీ తినేందుకు హోటల్‌కు చేరుకున్నారు.

Cafe Bahar Returns Hyderabad s Beloved Eatery Reopens After SC Ruling

51 ఏళ్ల క్రితం ప్రారంభమైన కేఫ్ బాహర్ హోటల్ మూతపడటం ఇది తొలిసారి. అక్టోబర్ 10వ తేదీన ఈ హోటల్‌కు తాళం వేశారు.వ్యాపార నిర్వహణలో కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత విబేధాలు తలెత్తడంతో రెస్టారెంట్ మూసేయాల్సి వచ్చింది. ఈ వివాదాలు విబేధాలు కాస్త తెలంగాణ హైకోర్టు తలుపును తట్టాయి. కేఫ్ బాహర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిందిగా మరో పార్టీని కోర్టు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేఫ్ బాహర్ మేనేజింగ్ పార్ట్‌నర్ అలీ అస్గర్ బులూకీ.కేసు విచారణ చేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ కేఫ్ బాహర్ రెస్టారెంట్‌ను పునఃప్రారంభించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

కేఫ్ బాహర్ రెస్టారెంట్‌ నడుపుతూనే దానికి సంబంధించిన ఆస్తుల విలువను, భాగస్వాములకు సెటిల్‌మెంట్‌ కోసం అవలంబించాల్సిన ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇక కుటుంబంలో తలెత్తిన విబేధాలు ఆస్తుల పంపకాల సమయంలో తలెత్తే విబేధాలను పరిష్కరించేందుకు జస్టిస్ గోదా రఘురాంను నియమించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేఫ్ బాహర్ రెస్టారెంట్ సోమవారం రోజున తిరిగి ప్రారంభమైంది.కొన్ని దశాబ్దాలుగా భోజనప్రియులకు రుచిలో ఎలాంటి తేడా లేకుండా నాణ్యమైన బిర్యానీ వడ్డిస్దూ తిరిగి ప్రారంభం కావడంతో కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+