చిత్తుగా తాగి బిటెక్ విద్యార్థుల డ్రైవింగ్: కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

హైదరాబాద్: మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపిన యువకుల చర్య ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని హందూ శ్మశానవాటిక వద్ద శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదం చోటు చేసుకుంది.

మాదాపూర్‌లోని నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పమ్మి రాజేష్ (38) హైదరగుడాలోని సెయింట్ పాల్స్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న తన అన్న కూతురు రమ్య (8)ను తీసుకుని శాంత్రో కారులో బయలుదేరాడు. కారులో వీరితో పాటు రాజేష్ మరో సోదరుడు రమేష్, వదిన రాధిక, తండ్రి మధుసూదన రావు ఉన్నారు.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

వారంతా చిన్నారిని బోరబండలోని ఆమె ఇంట్లో వదిలేందుకు పంజగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్నారు.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

అదే సమయంలో మఫకంజా కాలేజీ వైపు నుంచి చిత్తుగా మద్యం సేవించి వేగంగా వస్తున్న ఆరుగురు విద్యార్థులతో కూడిన ఐ10 కారు శ్మశానవాటిక వద్ద అదుపు తప్పింది.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

పంజగుట్ట వైపు వెళ్తున్న ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ పై నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక కార్యాలయం వైపు వెళ్తున్న రాజేష్ కారుపై పడింది.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

దాంతో కారు నడుపుతున్న రాజేష్ అక్కడికక్కడే మరణించగా, అందులో ఉన్న రమ్యతో పాటు మిగతావారు గాయపడ్డారు. రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

చిన్నారిని నిమ్స్‌కు, మిగతావారిని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఎన్. సూర్య, విష్ణు, షవెల్, అశ్విన్, సాయి రమేష్, అలెన్ జోసెఫ్ ఉన్నారు. కారు నడుపుతున్న షవెల్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని కేర్ ఆస్పత్రికి తరలించారు.

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి

వీరంతా నారాయణగుడాలోని కేశవ్ మెమోహియాల్ ఇంజనీరింగ్ బిటెక్ చదువుతున్నారు. బంజారాహిల్స్‌లోి సినీమ్యాక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత పార్టీ ముగించుకుని ఒకే కారులో బయలుదేరారు. అందరూ హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులు అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+