రింగ్ రోడ్డులో కారు దగ్ధం, వారు దిగగానే.. (ఫోటో)
హైదరాబాద్: అవుటర్ రింగు రోడ్డు పైన ఓ కారు ఆదివారం నాడు మంటలు అంటుకొని దగ్ధమైంది. గుంటూరు నుండి నగరానికి వస్తున్న ఈ కారులో యజమానితో పాటు నలుగురు ఉన్నారు. శంషాబాద్ పరిధిలోకి రాగానే ఆయిల్ లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు.
దీంతో అందరు కూడా కారులో నుండి బయటకు దిగారు. వారు దిగిన వెంటనే కారులో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి కూడా ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

బాలికను అపహరించి నగలతో ఉడాయించారు
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారని ఎత్తుకెళ్లి బంగారు చెవిపోగులు, కాళ్ల పట్టీలను అపహరించిన సంఘటన ఆదివాహం జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. జవహర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం... కాప్రా జమ్మిగడ్డ పరిధఇలోని భగత్ నగర్లో రాజు, తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
ఆదివారం సాయంత్రం కూతురు ధృత ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ మహిళ చాక్లెట్లు ఇప్పిస్తానని పాపను ఎత్తుకెళ్లింది. ఇంటి నుండి కిలోమీటరు దూరం వరకు తీసుకు వెళ్లి పాప చెవికి ఉన్న రెండు గ్రాముల బంగారు పోగులు, కాళ్ల వెండి పట్టీలను అపహరించింది.
పాపను అక్కడే వదిలేసింది. తల్లిదండ్రుల పాప కోసం వెతికి, పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మల్కాజిగిరి పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి, గాలించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పాప కనిపించింది. తల్లిదండ్రులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications