మహిళలతో రాసలీలలు: స్పీకర్ గన్‌మన్‌పై కేసు నమోదు

వరంగల్: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో ఓ మహిళతో రాసలీలలు జరుపుతూ పట్టుబడిన స్పీకర్‌ మధుసూదనాచారి గనమన్ వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా భూపాలపల్లికి వచ్చిన స్పీకర్‌ మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గన్‌మన్ దారుణానికి పాల్పడ్డాడు.

స్థానిక మహిళ ఇంటికెళ్లి రాసలీలల్లో మునిగిపోయిన గన్‌మన్‌ను మహిళ భర్త స్థానికులతో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దాంతో బట్టలు లేకుండానే అక్కడినుంచి ఉడాయించిన వెంకటేశ్వర్లుపై మహిళ భర్త ఫిర్యాదుతో 448 (అక్రమ ప్రవేశం), 497 (వ్యభిచారం) కేసులు నమోదు చేసినట్లు భూపాలపల్లి సీఐ రఘునందన్‌రావు తెలిపారు.

Case booked against Telangana speaker's gunman

స్పీకర్ వద్దకు ఏదో పని నిమిత్తం వచ్చిన మహిళతో పరిచయం గన్‌మన్ పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని అతడు వివాహేతర బంధంగా మార్చుకున్నాడు. ఆ భద్రతాధికారి స్పీకర్‌కు భద్రత కల్పించే విషయాన్ని పక్కనబెట్టి మహిళ ఇంటికి వెళ్లి రాసలీలల్లో మునుగుతాడని అంటున్నారు.

మహిళతో స్పీకర్ భద్రతాధికారి రాసలీలలు, నడిరోడ్డుపై నగ్నంగా పరుగెత్తాడుఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మధుసూదనాచారి భూపాలపల్లి వెళ్లగా.. ఆయనకు భద్రతగా అక్కడికి వెళ్లిన సదరు భద్రతాధికారి రాత్రి కాగానే విధులకు డుమ్మా కొట్టి మహిళ వద్దకు వెళ్లాడని తెలుస్తోంది. ఆమెతో రాసలీలల్లో మునిగిపోయాడు.

అప్పటికే ఆ అధికారి వ్యవహారం పైన ఆగ్రహంగా ఉన్న మహిళ తరఫు బంధువులు కాపు కాసి, దాడి చేశారు. దీంతో అతను దుస్తులు లేకుండానే నగ్నంగా రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చాడు. ఈ క్రమంలో అక్కడ పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతనిని రక్షించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+