అజారుద్దీన్ ను పదవి నుంచి తొలగించాలి - అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు..!!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. ఈ నెల 25న హైదరాబాద్ కేంద్రంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. చాలా రోజులుగా ఈ మ్యాచ్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నా..టికెట్ల అమ్మకాల మొదలు మ్యాచ్ ఏర్పాట్ల వరకు అజారుద్దీన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మ్యాచ్ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. టిక్కెట్ల కోసం వచ్చిన పలువురు అభిమానులు తొక్కిసలాటలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, స్టేడియంలో ఏర్పాట్లైన విమర్శలు మొదలయ్యాయి.
అయితే టిక్కెట్ల అమ్మకాలు..తొక్కిసలాట అంశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేదని అజారుద్దీన్ చెబుతున్నారు. టిక్కెట్లు తీసుకోవటానికి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో రావటంతో అది జరిగిందని, దీని పైన తాను ఏదైనా తప్పు చేస్తే శిక్షకు సిద్దమని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, విమర్శలు మాత్రం ఆగటం లేదు. తాజాగా అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని బీసీ రాజకీయ ఐకాస నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్‌తో పాటు... హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కోరారు.

తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉప్పల్‌లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌కు ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. క్రీడాభిమానుల నుంచి కోట్ల రూపాయలు దండుకొని..సరైన ఏర్పాట్లు చేయని... హెచ్‌సీఏ ఇతర రాజకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేసారు.హెచ్‌సీఏ లో కొనసాగుతున్న విభేదాలు ఈ మ్యాచ్ పైన ప్రభావం చూపుతున్నాయి. అటు మ్యాచ్ కు ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. స్టేడియంలో ఏర్పాట్ల పైన విమర్శలు వస్తున్నాయి. కానీ, మ్యాచ్ సక్రమంగా నిర్వహించటమే తమ ముందున్న లక్ష్యమని అజారుద్దీన్ చెబుతున్నారు. దీంతో, హైదరాబాద్ లో మ్యాచ్ అంశం ఇప్పుడు క్రీడాభిమానులకు ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications