కవితకు బిగ్ షాక్..
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. సీబీఐ..ఆమెపై కొరడా ఝుళిపించింది. తాజాగా ఛార్జిషీట్‌ను ఫైల్ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఇదివరకే పొడిగించిన విషయం తెలిసిందే. జులై 3వ తేదీ వరకు ఆమె కస్టడీలో ఉండనున్నారు. ఆ తరువాత ఆమెకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది అప్పుడు ఢిల్లీ కోర్టు నిర్ణయిస్తుంది. ఈడీ అధికారుల వాదనల తరువాత నిర్ణయం తీసుకుంటుంది.
ఈ పరిస్థితుల మధ్య ఆమెపై తాజాగా సీబీఐ సైతం ఛార్జిషీట్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్. దీన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు సీబీఐ అధికారులు. న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా.. దీన్ని సమీక్షించనున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో తొలిసారిగా సీబీఐ అధికారులు ఆమెపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 60 రోజుల్లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీని కాల వ్యవధి ముగుస్తోన్నందున.. కొత్తగా ఛార్జ్‌షీట్ పెట్టారు.












Click it and Unblock the Notifications