ఆ ఎమ్మెల్యేల ఎరకేసులో రేవంత్ రెడ్డికి కొత్త ఆయుధం..!
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో చోటు చేసుకుంటున్న పరిణామాలు రేవంత్ రెడ్డికి ఒక కొత్త ఆయుధాన్ని అందించాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరికించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశిస్తే, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బిజెపి సి.బి.ఐ విచారణకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది తెలంగాణా ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్న చందంగా మారింది. అయితే సందట్లో సడేమియా అంటూ అటు బిజెపి ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఈ కేసులో కొత్త ఎత్తుగడకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇక తాజా ఆలోచనతో ఆ 12 మందికి చుక్కలు కనిపిస్తాయన్న చర్చ జరుగుతుంది.

రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేల ఎరకేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, బిజెపి ట్రాప్ చేసిందని బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విచారణకు ఆదేశించడంతో మొదలైన రగడ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల ఎరకేసులో కాంగ్రెస్ నుండి పార్టీ మారిన వారికి చెక్ పెట్టటానికి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ అధికారులకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయనుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల ఎరకేసును అలా విచారిస్తే అది ఇన్ కంప్లీట్ అంటున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేల ఎర కేసును కేవలం బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతోనే ముడి పెట్టి విచారణ సాగిస్తే అది ఇన్ కంప్లీట్ అని, ఎమ్మెల్యేల ఎర కేసు విచారణకు కాంగ్రెస్ తరపున కూడా వినతి పత్రం అందజేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఈ కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యాలా? వద్దా? అనే దానిపై చర్చిస్తున్నామని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు పార్టీ మారిన వారేనని పేర్కొన్నారు. వారిలో ఇద్దరికి ఇలాంటి వ్యవహారాలు అలవాటన్నారు.

12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణకు ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుండి మారి బీఆర్ఎస్ లో చేరిన వారికి మంచి పదవులు ఇచ్చారని, అది కూడా అవినీతి కిందికే వస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలన్న దానిపై చర్చ చేస్తున్నామని, త్వరలోనే సీబీఐకి దీనిపైన ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేల ఎరకేసును కాంగ్రెస్ తమను మోసం చేసి పార్టీ మారిన వారిని టార్గెట్ చెయ్యటానికి ఆయుధంగా వాడుకోనున్నట్టు తెలుస్తుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications