కవిత దందాలన్నింటినీ బయట పెట్టిన సీబీఐ!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత కవిత చేసిన దందాలన్నింటినీ సీబీఐ తన కస్టడీ నివేదికలో పేర్కొంది. కవితే రూ.100 కోట్లు చెల్లించినట్లు ఇందులో పొందుపరిచింది. అరబిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డిని ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో ఎలా వ్యాపారం చేస్తారో చూస్తానంటూ బెదిరించారని వెల్లడించింది. భూమి లేకుండానే వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారని సీబీఐ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి పరిచయం చేసినందుకు తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు చెల్లించారని, నకిలీ భూ విక్రయం పేరుతో కవిత రూ.14 కోట్లు తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ.14 కోట్లు ఇవ్వాలని కవిత శరత్ ను డిమాండ్ చేశారు. ఆ భూమి గురించి తనకు తెలియదని, డబ్బు ఇవ్వనని శరత్ చెప్పారు. అయితే రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా వ్యాపారం ఉండదని కవిత బెదిరించారు.

cbi sensational allegations on kalvakuntla kavitha in delhi liquor scam

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత శరత్ ను డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటను కూడా రూ.50 కోట్లు డిమాండ్ చేయగా ఆయన తన కుమారుడు మాగుంట రాఘవద్వారా రూ.25 కోట్లు చెల్లించారు. రాఘవ కూడా అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చారు. కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్ కు కవిత రూ.100 కోట్లు చెల్లించారని, గోవాకు రూ.44.45 కోట్లను హవాలాద్వారా బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు ఈ డబ్బును చేర్చడంతోపాటు ఇండో స్పిరిట్స్ లో 65 శాతం వాటా పొందారు. అయితే వీటన్నింటిపై కవిత సరైన సమాధానాలు చెప్పడంలేదని, ఆమెను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+