కేంద్ర బడ్జెట్‌పై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?
కేంద్ర బడ్జెట్ సమతుల్యంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు.
కోటిమంది పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే కేంద్రం లక్ష్యం పెట్టుకుందన్నారు. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్లో పెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు నరేంద్ర మోడీ సర్కారు చేసిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా పన్ను స్లాబ్‌లను మార్చిందని.. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుందని కిషన్ రెడ్డి వివరించారు.
The NDA's 11th consecutive full budget and its first in the 3rd term has focussed entirely on
— G Kishan Reddy (@kishanreddybjp) July 23, 2024
- empowering the Garib
- Leveraging the power of Youth
- Transforming the productive capabilities of our Annadata
- Empowering the resilience and shakti of the Nari
- Honoring our… pic.twitter.com/BwOtpBBt5p
ఇది ఇలావుండగా, కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని అన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలని తాము కూడా కేంద్రాన్ని అడిగామని చెప్పారు. తెలంగాణకు అవరసమైన నిధులు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేస్తారన్నారు. మరోవైపు, కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇది పేదల బడ్జెట్‌గా అభివర్ణించారు.
దేశ యువతకు పెద్దపీట వేసిందని కొనియాడారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో రేవంత్ రెడ్డినే అడగాలన్నారు. రేవంత్ రెడ్డి అతని గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోడీతో ఎలాంటి అర్జీలు, విన్నపాలు చేసుకున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నడపలేని స్థితిలో ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications