తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఊహించని పరిణామం - కలిసొచ్చేదెవరికి..!!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం మారే అవకాశం కనిపిస్తోంది. జమిలి ఎన్నికల దిశగా ఢిల్లీ కేంద్రం గా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. రెండు దశల్లో జమిలి నిర్వహణ దిశగా కేంద్రం కసరత్తు కొనసా గుతోంది. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో తొలి విడత జమిలి నిర్వహణ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. కలిసొచ్చేదెవరికి..

కేంద్రం కసరత్తు
కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత జమిలి పైన కసరత్తు వేగవంతం చేసింది. 2029లో తొలి విడత జమిలి నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో, 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 2034 నాటికి మిగతా రాష్ట్ రాలనూ కలిపి జమిలి జరగనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ రానుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే జరిగితే ఈ సారి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు.. ఈసారి లోక్‌సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

central-planning-for-one-nation-one-election-first-phase-in-2029-as-reports

తెలంగాణ ఎన్నికలు
ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహిం చాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలిదఫా జమిలిగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంటుతో కలిపే ఎన్ని కలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికలు కూడా జమిలిగానే నిర్వహించారు. అయితే ఆ తర్వాత 2018లో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం లోక్‌సభతో కాకుండా సుమారు ఐదు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. 2023లో ఎన్నికలు.. డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ లెక్కన 2028 డిసెంబర్ నాటికి తిరిగి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

పార్లమెంట్ తో పాటుగా
అయితే, ఢిల్లీలో జరుగుతున్న ప్రచారం మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక లు 2029 లో పార్లమెంట్ తో పాటుగా జరుగుతాయని భావిస్తున్నారు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మిగిలి న రాష్ట్రాల్లో అక్కడి షెడ్యూల్ కు అనుగుణంగా జరుగుతున్నాయి. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు సుమారు ఏడాది ముందుగానీ, ఏడాది తర్వాతగానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రా లను ఒక కేటగిరీగా తీసుకోవాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే 2028, 2029లో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలి విడతలో పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కన 2028లో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హరియాణ, జార్ఖండ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 16 రాష్ట్రాలకు 2029 పార్లమెంటు ఎన్నికలతో కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీంతో.. ఇదే జరిగితే రాజకీయంగా ఎన్నికలు ఎవరికి కలిసి వస్తాయనే అంచనాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+