Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15th Finance Commission నిధుల విడుదల, ఆర్థిక శాఖ ఉత్తర్వులు

గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నిధుల విషయంలో ఎట్టకేలకు రాష్ట్రానికి ఊరట లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్ల నిధులను విడుదల చేసింది. రెండేళ్లుగా నిధుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీలకు ఇది కీలక పరిణామంగా మారింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు, ఆపై ఎన్నికల జాప్యం ఈ నిధుల నిలిపివేతకు ప్రధాన కారణాలయ్యాయి. ఎన్నికలు పూర్తయిన తరువాతే నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

Centre Gives Green Signal to 15th Finance Commission Funds Bringing Relief to Gram Panchayats

15th Finance ఆలస్యం..

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో పాటు పలువురు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిసిన మంత్రి, రాష్ట్రంలో గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను వివరించారు.

అయితే, ఎన్నికలు పూర్తికాకపోవడంతో అప్పట్లో కేంద్రం నిధుల విడుదలకు అంగీకరించలేదు. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మార్చి 31లోపు నిధులు విడుదల కాకపోతే అవి శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి, కేంద్రంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించారు.

కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఈ క్రమంలో మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు కూడా కేంద్ర శాఖలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఈ సమిష్టి ప్రయత్నాల ఫలితంగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. అందులో తొలి విడతగా రూ.259.36 కోట్ల విడుదలపై గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన పెండింగ్ నిధులు కూడా దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది.

సీతక్క హర్షం..

తొలి విడత నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని ఆమె తెలిపారు. గ్రామ స్వరాజ్యం బలోపేతం కావాలంటే గ్రామ పంచాయతీలకు సమయానికి నిధులు అందడం అత్యంత అవసరమని స్పష్టం చేస్తూ, మిగిలిన నిధులను కూడా ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె గట్టిగా కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+