బిజెపి, టిడిపి బహిరంగ సభ: లోకేష్‌ సహా చంద్రబాబు హాజరు, రాజాసింగ్‌కు నో ప్లేస్

హైదరాబాద్ : బిజెపి, టిడిపి కూటమి గ్రేటర్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు బిజెపి నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు.

ఈ బహిరంగ సభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి, చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. బిజెపి నేతలు జి. కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి, టిడిపి నాయకుడు సుజానా చౌదరి కూడా వచ్చారు. కేంద్ర మంత్రి నడ్డా కూడా హాజరయ్యారు.

TDP-BJP Nizam College meeting

కాగా, బిజెపి శానససభ్యుడు రాజాసింగ్ ఫోటో గానీ, ఫ్లెక్సీ గానీ బహిరంగ సభలో కనిపించలేదు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను ఈ సభకు ఆహ్వానించలేదని సమాచారం.

గత 18 నెలల కాలంలో మెదక్, వరంగల్‌ లోక్‌సభకు ఎన్నికలు జరిగినా ఎక్కడా చంద్రబాబు తెరమీదకు రాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం తెరవెనుక ఉండి టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం బాబు పెద్దగా పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.. సీనియర్ల మధ్య సమన్వయం లేని పరిస్థితుల్లో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. ఈఎన్నికల ప్రచారానికి చంద్రబాబు రావడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+