నేను ఎక్కడికీ పోలేదు, హైదరాబాద్ అభివృద్ధి అంతా నాదే: చంద్రబాబు

హైదరాబాద్: తాను ఎక్కడికీ పోలేదని, తాను పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాదును ప్రపంచ పటం మీద నిలిపింది తానే అని ఆయన చెప్పారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో ఆయన మంగళవారం రాత్రి మాట్లాడారు.

టిడిపి కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారిని జీవితంలో మరిచిపోలేనని, తాను ఎక్కడికీ పోలేదని, కార్యకర్తలతోనే ఉంటానని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్లు అని ఆయన అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఒక్కటేనని, రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు. తెలంగాణలో కరువు ఉందీ సాయం చేయాలని తాను కేంద్రాన్ని కోరానని ఆయన అన్నారు.

Chandrababu Naidu

విభజన జరిగిన తీరు సరిగా లేదని, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరానని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 14 శాసనసభా స్థానాలు గెలిచామని, బిజెపి - టిడిపి కంచుకోట హైదరాబాద్ అని ఆయన అన్నారు. సీట్ల సర్దుబాటు విభేదాలు లేకుండా చేసుకోవాలని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి, కూటమి అధికారంలోకి రావాలంటే జిహెచ్ఎంసి ఎన్నికలు నాంది పలకాలని ఆయన అన్నారు.

ఎపి ముఖ్యమంత్రిగా, టిడిపి జాతీయ అధ్యక్షుడిగా తనకు రెండు బాధ్యతలు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాద్యత తనపై ఉందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి చేసిన అభివృద్ధిని, తెచ్చిన సామాజిక మార్పుని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.

Chandrababu_Nizam College

సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ దేశంలో నాంది పలికారని, తెలుగుజాతి మీద ఎన్టీఆర్‌కు ఆపారమైన విశ్వాసమని, అందుకే ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలు పెట్టారని ఆయన అన్నారు. సమస్యలను అవకాశంగా తీసుకుని తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. బిజెపి, టిడిపి కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

తాను సమైక్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఖజానా ఖాళీగా ఉందని, హైదరాబాద్ బ్రహ్మాండమైన నగరంగా ఉండాలని నిరంతరం కృషి చేశానని ఆయన చెప్పారు. అతి కష్టం మీద బిల్ గేట్స్‌ను కలిశానని, అమెరికాలో తిరిగానని, హైదరాబాదుకు ఐటి కంపెనీలు తెచ్చానని ఆయన చెప్పారు. సైబరాబాదును 9 నెలల్లో పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి హైదరాబాదును అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. హైదరాబాదుకు అంతర్జాతీయ విమానాస్రయాన్ని, మెట్రో రైలు ప్రాజెక్టును తదితరాలను తెచ్చామని, తన కృషి వల్ల హైదరాబాదులో ఆస్పత్రులు, హోటల్లు వచ్చాయని, హైదరాబాదు నాలెడ్జి నగరంగా మార్చానని ఆయన చెప్పారు. రోడ్లు భవనాలు, విద్యుచ్ఛక్తి, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని ఆయన చెప్పారు. తాను హైదరాబాదును మరిచిపోలేదని ఆయన చెప్పారు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకరించుకుంటాయని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను పాటుపడుతానని ఆయన చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.

చంద్రబాబును అభినందిస్తున్నా..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేస్తున్న కృషికి చంద్రబాబును తాను అభినందిస్తున్నట్లు బిజెపి నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాసను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లకయ్యే ఏడేసి లక్షల రూపాయల్లో కేంద్రం నిధులు రెండు లక్షలు ఉన్నాయని, తెలంగాణ అభివృద్ధికి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ నిధులు ఇప్పిస్తున్నామని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.

వాజ్‌పేయి, చంద్రబాబు హయాంలోనే...

వాజ్‌పేయి, చంద్రబాబు హయాంల్లోనే హైదరాబాదు రూపురేఖలు మారాయని కేంద్ర మంత్రి జెపి నడ్డా అన్నారు. ఎపితో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోరాడుదామని ఆయన అన్నారు. పదిహేనేళ్ల క్రితమే హైదరాబాదును స్మార్ట్ సిటిగా మార్చారని ఆయన చెప్పారు.

మజ్లీస్‌ను అడ్డుపెట్టుకుని...

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుపెట్టుకొని ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన తెలిపారు. మతన్మోదాన్ని, రౌడీయిజాన్ని పెంచి పోషించిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+