హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెంచులక్ష్మి అరెస్ట్.. అంతా ఆమె మారిపోయింది అనుకుంటున్న వేళ.. అనూహ్యంగా మళ్లీ ఇలా...

|
Google Oneindia TeluguNews

చెంచు లక్ష్మి అలియాస్ గడ్డం లక్ష్మి... చోరీ కేసులకు ఒకరకంగా ఆమె కేరాఫ్‌గా మారింది. దాదాపు 100కి పైగా చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉన్న చెంచు లక్ష్మి గతంలో జైలు శిక్ష కూడా అనుభవించింది. రెండేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న చెంచు లక్ష్మి ఉన్నట్టుండి మళ్లీ చోరీ కేసుతో వార్తల్లోకి ఎక్కడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను మారిపోయానని... పెట్రోల్ బంకులో పనిచేసుకుంటున్నానని గతంలో పలు యూట్యూబ్‌ ఛానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అలాంటిది మళ్లీ ఆమె చోరీల బాట పట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

ఏ కేసులో అరెస్టయింది...

ఏ కేసులో అరెస్టయింది...

మంగళవారం(మే 11) పలు పత్రికల్లో,సామాజిక మాధ్యమాల్లో చెంచు లక్ష్మి అరెస్ట్ అనే వార్త చాలా మంది దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీసులు సోమవారం(మే 10) ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 9 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.11,520 నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 7, 8 తేదీల్లో కుర్మగూడలోని రెండు ఇళ్లతో పాటు ఓ గుడిలో ఆమె చోరీ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెంచులక్ష్మే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

వారం రోజులుగా విధులకు డుమ్మా...

వారం రోజులుగా విధులకు డుమ్మా...


గతంలో పలు చోరీ కేసుల్లో నిందితురాలైన చెంచు లక్ష్మి కొన్నేళ్లు జైలు శిక్ష అనుభవించింది. జైల్లో శిక్ష అనుభవిస్తుండగానే ఆమె ప్రవర్తనలో పోలీసులు మార్పును గమనించారు. జైలు నుంచి విడుదలయ్యాక పెట్రోల్ బంకులో ఉద్యోగం ఇప్పించారు. దీంతో రెండేళ్ల నుంచి చెంచు లక్ష్మి పెట్రోల్ బంకులో పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతోంది. ఇదే క్రమంలో అనారోగ్య కారణాలు చెప్పి వారం రోజులుగా ఆమె పెట్రోల్ బంకులో విధులకు రావట్లేదు. ఈ వారం రోజుల్లోనే ఆమె అద్దెకు ఉంటున్న మాదన్నపేట ప్రాంతంలో చోరీలు జరగడంతో... అందులో ఆమె పాత్ర ఉందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లక్ష్మి...

పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లక్ష్మి...


చెంచు లక్ష్మి గతంలో యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... తినడానికి తిండి లేని స్థితిలో 14 ఏళ్ల వయసులో తాను దొంగతనాలకు అలవాటుపడ్డానని చెప్పింది. పోలీసు రికార్డుల్లో తనపై 200 కేసులు ఉన్నప్పటికీ అందులో ఎక్కువ శాతం తప్పుడు కేసులేనని ఆరోపించింది. తాళాలు వేసిన ఇళ్లు చోరీ చేయడంలో చెంచు లక్ష్మి ఎక్స్‌పర్ట్. చోరీ డబ్బుతో రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నానని... కానీ ఆ ఇంటిని పోలీసులే లాగేసుకున్నారని పేర్కొంది . 2004 నుంచి 2009 వరకు తెలుగు రాష్ట్రాల పోలీసులను ఆమె ముప్పు తిప్పలు పెట్టింది. ఒకానొక సందర్భంలో 12 అడుగుల ఎత్తయిన జైలు గోడను సైతం ఆమె సునాయసంగా ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నించింది. దీంతో రాష్ట్రంలోని జైలు గోడల ఎత్తును పెంచారు.

Recommended Video

Telangana Lockdown : రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే - Bandi Sanjay
మళ్లీ చోరీల బాట...

మళ్లీ చోరీల బాట...


చెంచు లక్ష్మి అలియాస్‌ గడ్డం లక్ష్మి, గోదావరి, గుండ్లపోచిపై హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 100కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. 2016లో చోరీ కేసుల్లో అరెస్టయిన ఆమె మూడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. 2019 నంబర్‌లో జైలు నుంచి విడుదలైంది. జైలు అధికారులు ఆమె తిరిగి నేరాల బాట పట్టకుండా పెట్రోల్ బంకులో ఉపాధి కల్పించారు. అప్పటినుంచి సాధారణ జీవితానికి అలవాటుపడినట్లే కనిపించిన చెంచు లక్ష్మి మళ్లీ చోరీల బాట పట్టడం గమనార్హం.

English summary
A 33-year-old female house burglar has been arrested by Hyderabd police for allegedly involved in several theft cases. Chenchu Lakhsmi alias Gaddam Lakshmi Godavari alias Gundla Pochi started burglaries from the age of 14 while working as a daily wage worker. She adopted techniques from her mother Gaddam Chennamma. As she was skilled in climbing trees and walls she was given the name Chenchu Lakshmi by her childhood friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X