అత్తగారి చివరి కోరికను నెరవేర్చిన మెగాస్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం మరణానంతరం నేత్రదానం చేశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అత్తగారి కళ్ళను బ్లడ్ బ్యాక్ కు దానం చేశామని తెలిపారు. దీనికి ఆమె కుమారుడు అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించారని పేర్కొన్నారు. అడిగిన వెంటనే నేత్రదానానికి అల్లు అరవింద్ అంగీకరించారని, మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని అన్నారు.
శనివారం అల్లు కనకరత్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో తెల్లవారుజామున 1:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి కోకాపేట్ లో అంత్యక్రియలను నిర్వహించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలను నిర్వహించారు.

దీని తర్వాత స్టార్ హాస్పిటల్స్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అల్లు కనకరత్నం నేత్రదానం చేసిన విషయాన్ని వెల్లడించారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అత్తగారు మరణించినట్లు తనకు సమాచారం అందిందని అన్నారు. ఆ సమయంలో అల్లు అరవింద్ కూడా ఇంట్లో లేడని, ఆయన బెంగళూరుకు వెళ్లాడని, అప్పుడు తాను ఒక్కడినే ఉన్నానని చెప్పారు.
మరణవార్త తెలిసిన వెంటనే అవయావదానం గురించి అల్లు అరవింద్ తో ఫోన్ లో మాట్లాడానని, నేత్ర దానం చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ ను కోరుగా దానికి ఆయన వెంటనే అంగీకరించాడని చిరంజీవి చెప్పారు. 2:30 గంటల సమయంలో అప్పటికప్పుడు తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జి స్వామినాయుడిని సంప్రదించానని, దీనికి వారు వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారని చిరంజీవి పేర్కొన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లను తీసుకొచ్చారని అన్నారు.












Click it and Unblock the Notifications