హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు థ్యాక్సంటూ మెగాస్టార్ చిరంజీవి: ఎంతో మేలు చేశారంటూ ప్రశంస

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం అనేకమంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

కేసీఆర్‌కు చిరంజీవి ధన్యవాదాలు

కేసీఆర్‌కు చిరంజీవి ధన్యవాదాలు

'తెలుగు పరిశ్రమ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపినీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఢతలు. సినిమా థియేటర్ల మనుగుడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

సినీ పరిశ్రమ బాగు కోసమంటూ చిరంజీవి

సినీ పరిశ్రమ బాగు కోసమంటూ చిరంజీవి

అంతేగాక, ' సినీ పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్థం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు' అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచినందుకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ల రేట్లు

తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ల రేట్లు

కాగా, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది. టికెట్ ధరలు పెంచాలంటూ ఇటీవల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనను ఆమోదించాల్సిందిగా హోంశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు టికెట్ ధరలను సిద్ధం చేసి.. శనివారం జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం.. ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల కోసం, కనిష్ట ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు, ధర రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి), టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతి ఉంది. మరోవైపు ఏపీలో సినిమా టికెట్ల తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమలోని పలువురు నటులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary
Chiranjeevi says thanks to CM KCR for cinema tickets rates hike in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X