వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరుకు రోడ్డుతో నరకం చూస్తున్న నగర వాసులు.!రోడ్డు వెడల్పుకు కృషి చేస్తానన్న మేయర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాగ్అంబర్ పేట డివిజన్ డి.డి కాలనీ రోడ్డును వెడల్పు చేసేందుకు కృషి చేస్తామని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు. శివం రోడ్డు నుండి డి.డి కాలనీ రోడ్డును అంబర్ పేట్ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ తో కలిసి రోడ్డు వెడల్పు ప్రతిపాదన స్థలాన్ని మేయర్ సోమవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబందించిన ప్రహరీ గోడ తొలగించాల్సి ఉన్నందున ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో స్థలానికి సంబందించిన పూర్తి వివరాలను అందజేయాలని అంబర్ పేట్ తహశీల్దార్ ను మేయర్ ఆదేశించారు. డి.డి కాలనీ సాయి బాబా గుడికి భక్తులు చాలా మంది వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యతో పాటు 6వ నంబర్ రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నందున వాహనదారులు రామంతపూర్, ఉప్పల్ కు అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా ప్రత్యామ్నాయ మార్గంగా భావించడం మూలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నట్టు కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి మేయర్ కు వివరించారు.

 City dwellers looking hell with the narrow road.!Mayor will work for the width of the road.!

శివంరోడ్డు నుండి సాయి బాబా టెంపుల్ మీదుగా పార్కు వరకు 40 ఫీట్ల రోడ్డు ఉందని దాన్ని 60 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని కార్పొరేటర్ మేయర్ ను కోరారు.
రోడ్డు వెడల్పుకు సంబందించిన పూర్తి వివరాలు పరిశీలన చేసి నివేదిక అందజేయాలని చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి దేవందర్ రెడ్డిని మేయర్ ఆదేశించారు.
మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రోడ్డు వెడల్పుకు కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట వద్ద రోజు వారీ చెత్తను తొలగించక పోవడం వలన ప్రజకు చాలా అసౌకర్యంగా పరిణమించినట్టు, ప్రతి రోజు చెత్తను, వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మేయర్ ను కోరారు. చెత్త వ్యర్థాల తొలగింపులో జాప్యం కానీ, నిర్లక్ష్యం వహించవద్దని జోనల్ కమిషనర్ ను మేయర్ ఆదేశించారు. డివిజన్ స్థాయిలో సంబంధిత కార్పొరేట్ తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.

Recommended Video

Lakshya Trailer Review | Akhanda Movie Is The Deciding Factor || Oneindia Telugu
 City dwellers looking hell with the narrow road.!Mayor will work for the width of the road.!
English summary
Mayor Gadwal Vijaya Lakshmi said efforts would be made to widen the Baghambar Peta Division DD Colony Road. The mayor on Monday inspected the road width proposal site along with Amber Pete legislator Kaleru Venkatesh on DD Colony Road from Sivam Road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X