విషాదం: స్కూల్ బ్యాగు మోయలేక విద్యార్థిని మృతి, కానీ, మరొకరికి వెలుగిచ్చింది

ఆధునిక చదువులు పిల్లలకు అన్ని రకాలుగా భారంగానే మారుతున్నాయి. ప్రాథమిక విద్యఅభ్యసిస్తున్న సమయంలో పుస్తకాలు బరువు మోయలేకపోతున్నారు.. ఆ తర్వాత ఉన్నత విద్యతో పెరుగుతున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు.

వరంగల్: ఆధునిక చదువులు పిల్లలకు అన్ని రకాలుగా భారంగానే మారుతున్నాయి. ప్రాథమిక విద్యఅభ్యసిస్తున్న సమయంలో పుస్తకాలు బరువు మోయలేకపోతున్నారు.. ఆ తర్వాత ఉన్నత విద్యతో పెరుగుతున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు తీవ్ర ఒత్తిడితో ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరైతే వారి తల్లిదండ్రులకు దూరంగా పారిపోతున్నారు.

తాజాగా, వరంగల్ జిల్లాలో సోమవారం మరో విషాద ఘటన చటో చేసుకుంది. స్కూల్ పుస్తకాల బ్యాగు మోయలేక ఓ విద్యార్థిని ప్రాణాలు వదిలింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

బ్యాగ్ బరువు మోయలేక కుప్పకూలిన వర్షిత

బ్యాగ్ బరువు మోయలేక కుప్పకూలిన వర్షిత

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... వరంగల్‌‌లోని కరీమాబాద్‌‌లోని తోట్లవాడకు చెందిన పవుడాల కుమారస్వామి, శోభ దంపతులకు ముగ్గురు సంతానం. వారంతా స్థానిక కౌటిల్య హైస్కూల్‌ లో చదువుతున్నారు. పెద్దకుమార్తె సాయివర్షిత (14) 9వ తరగతి చదువుతోంది. రోజులాగే స్కూల్ కు పుస్తకాల బ్యాగుతో వెళ్లింది. మూడో అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లేందుకు 12 కేజీల బరువున్న బ్యాగుతో మెట్లెక్కింది. తీరా తరగతి గదికి వెళ్లేలోపు బాల్కనీలో ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల నిర్వాహకులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది..

తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది..

ప్రథమ చికిత్స చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ ఆసుపత్రి నుంచి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా.. వర్షిత ప్రాణాలు విడిచింది. దీంతో శ్రీవర్షిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.

 మూడో అంతస్తుకు బరువైన బ్యాగుతో మెట్లెక్కడమే..

మూడో అంతస్తుకు బరువైన బ్యాగుతో మెట్లెక్కడమే..

పుస్తకాల బ్యాగు అతి బరువు, తరగతి గది మూడో అంతస్తులో వుండటమే విద్యార్థిని మృతికి కారణమని తెలుస్తోంది. కాగా, విద్యాశాఖ నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు 6 కేజీల లోపే ఉండాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా బాలిక అంత బరువైన పుస్తకాలు మోయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 దీపావళి పండగ నేపథ్యంలో తల్లికి సాయపడి..

దీపావళి పండగ నేపథ్యంలో తల్లికి సాయపడి..

దీపావళి పర్వదినానికి ఇంట్లో చేసుకునే లక్ష్మీపూజ, నోములను ఘనంగా నిర్వహించుకోవడానికి ఆదివారం తల్లితో కలసి ఇంటిపనులు చేసింది సాయివర్షిత. తండ్రి ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ కాగా పండగకు ఇంటికి సున్నాలు వేయడంలో సహాయపడింది. ఏనాడూ అనారోగ్యం ఎరగని సాయివర్షిత సోమవారం ఉదయం కూడా ఉత్సాహంగా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసిందని స్థానికులు తెలిపారు. తన చెల్లి అలేఖ్య, తమ్ముడు రోహిత్‌తో కలసి తల్లి తోడుగా పాఠశాలకు వెళ్లిన సాయివర్షిత మృతి చెందడం స్థానికులను కూడా కంటతడి పెట్టించింది.

వర్షిత నేత్ర దానం..

వర్షిత నేత్ర దానం..

కుప్పకూలి మృతి చెందిన విద్యార్థిని సాయి వర్షిత నేత్రాలను దానంచేశారు. సాయివర్షిత తల్లిదండ్రులు కుమారస్వామి, శోభను వారి బంధువులు కొమ్మిని సురేశ్‌, మాడిశెట్టి మురళి, కోరేకృష్ణ ఒప్పించి వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఐ బ్యాంకు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి విద్యార్థిని నేత్రాలను సేకరించి ఎల్వీప్రసాద్‌ ఐ బ్యాంకుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+