Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవిత రాజకీయానికి నో బ్రేక్.. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ తో సంతోషంలో జాగృతి నేతలు

తెలంగాణా రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్

ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు జీవితాన్ని అనుభవించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే తాజాగా కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేస్తూ, ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారనే సాక్షాదారాలు సమర్పించలేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఊరట లభించగా, జాగృతి నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

clean chit to kavith in delhi liquor case major obstacle removed for kavitha politics and politicial party

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన వివాదాస్పద కేసులో సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం సాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా, అధికారులు, వ్యాపారవేత్తలు నిందితులుగా చేర్చబడ్డారు. అందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్

కవిత ఈ కేసులో ఉండటంతో పాటు, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైంది. ఆ తర్వాత తెలంగాణా జాగృతి ద్వారా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న కవిత ప్రజలలో బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీని త్వరలో ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కవితకు ఇప్పుడు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావటం ఆమెకు పెద్ద అవరోధం తొలగిపోయినట్టు అయ్యింది.

కోర్టు తీర్పుతో తెలంగాణా జాగృతి శ్రేణుల్లో ఉత్సాహం

కోర్టు తీర్పుతో తెలంగాణ జాగృతి శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. తమ నాయకురాలిపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరితమని వారు ఎప్పటి నుంచో వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో తమ వాదనలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు. కవిత రాజకీయ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆమె మరింత చురుకుగా ప్రజాసేవలో పాల్గొంటారని జాగృతి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా రాజకీయాల్లో బలంగా ముందుకు వెళ్లనున్న కవిత

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణా రాజకీయాల్లో కవిత బలమైన ముద్ర వేసే రాజకీయం చేస్తారని జాగృతి నేతలు భావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+