క్లిక్ కొట్టు.. టామాటా పట్టు: ఇదో కొత్తం రకం బిజినెస్ స్ట్రాటజీ..!
హైదరాబాద్: భారీగా పెరిగిన టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టమాటాలను తమ వ్యాపారాల అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు కొందరు ఔత్సాహికులు. తాజాగా, కొత్తగూడెంలోని ఓ ఫోటోగ్రాఫర్.. టమాటాలను ఉపయోగించుకుని, గిరాకీ లేకుండా పోయిన తన వ్యాపారాన్ని బాగా పెంచుకుంటున్నాడు.
ఫోటోగ్రాఫర్ వేముల ఆనంద్.. పాస్‌పోర్ట్ ఫోటోల సెట్ కోసం తన స్టూడియోని సందర్శించే కస్టమర్‌లకు తిరుగులేని ఆఫర్‌తో ముందుకు వచ్చారు. కొత్తగూడెం టీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని తన స్టూడియోలో ఎనిమిది పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకుంటే.. టమోటాల ప్యాక్‌ను బహుమతిగా ఇస్తున్నాడు.

అంతేగాక, వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ టమాట ఆఫర్ ఫ్లెక్స్ బ్యానర్లు ఏర్పాటు చేశాడు. 'ఇటీవల జిల్లా కలెక్టరేట్, కొత్తగూడెంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పలోంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (IDOC) మార్చబడ్డాయి. ఫలితంగా, బస్టాండ్ సెంటర్‌లో చాలా మంది వ్యాపారంతో పాటు నా వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది, అని ఆనంద్ వాపోయాడు.
ఈ నేపథ్యంలోనే తిరిగి గిరాకీ పెంచుకునేందుకు ఈ ఆఫర్ తెచ్చినట్లు చెప్పాడు
ఆనంద్. కార్యాలయాలు మారక ముందు తన స్టూడియోకు రోజూ 20 నుంచి 30 మంది కస్టమర్లు వచ్చేవారన్నారు. ఇప్పుడు, స్టూడియోను సందర్శించడానికి ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వస్తే ఎక్కువ. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి, ఆనంద్.. రెండు రోజుల క్రితం ఫోటో కోసం టమోటా ఆఫర్‌ను ప్రారంభించాడు.
ఎనిమిది పాస్‌పోర్ట్ ఫోటోల సెట్ తీయడానికి రూ.100 ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాల ధర రూ.200 పలుకుతుండడంతో పావు కిలో టమాటా ప్యాకెట్ ధర రూ.50గా ఉంది. అయితే,ఈ ఆఫర్ లాభాలను తగ్గించినప్పటికీ, కనీసం వ్యాపారాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
తాజాఆఫర్‌తో.. ఇప్పుడు ఆనంద్ స్టూడియోను రోజుకు ఎనిమిది నుంచి 10 మంది కస్టమర్‌లు సందర్శిస్తున్నారు. టమాటో ధరలు ఆకాశాన్ని తాకిన క్రమంలో ఈ ఆఫర్ కొనసాగుతుందన్నారు. కాగా, జిల్లాలో రైతులు ఇటీవల పంటను సాగు చేయడంతో మరో నెలరోజుల్లో టమాటాల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు ఆనంద్.












Click it and Unblock the Notifications