వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రావాళ్లపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు -కుక్కల్లా మొరగొద్దు -ఆ పనితో హైబీపీ -హుజూరాబాద్‌లో ఓడినా..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సాధన ఉద్యమంలో ఆంధ్రా పాలకులను చీల్చి చెండాడిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రా సెటిలర్లను అక్కున చేర్చుకోవడం, ఏపీ వాసులు అధికంగా నివసించే ప్రాంతాల్లోనూ గులాబీ జెండాలు ఎగురుతుండటం తెలిసిందే. అయితే, చాలా కాలం తర్వాత కేసీఆర్ మళ్లీ ఉద్యమ భాషను వినిపించారు. ఆంధ్రుల దోపిడీని, సెటిలర్ల ప్రాంతీయ అభిమానాన్ని ప్రస్తావిస్తూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వివరాలివి..

నా ఫోన్‌కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనంనా ఫోన్‌కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనం

కారెక్కిన కౌశిక్ రెడ్డి

కారెక్కిన కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్‌ బహిష్కృత నేత, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలంగాణ భవన్ కు విచ్చేసి, గులాబీ కండువా కప్పి కౌశిక్ కు పార్టీలోకి ఆహ్వానం పలికారు. కౌశిక్‌ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ భవితవ్యం, తెలంగాణ ఉద్యమం, హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

సీఎం కేసీఆర్,టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేలా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు -నాడు కవితపైసీఎం కేసీఆర్,టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేలా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు -నాడు కవితపై

ఇక నిన్నెవడూ ఆపలేడు పో..

ఇక నిన్నెవడూ ఆపలేడు పో..

పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. ఇక ఆయన్ను ఎవడూ ఆపలేడని.. తన ఉన్నతికి హామీ ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయాలు సహజమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి గతంలో తనతో కలిసి ఉద్యమంలో పనిచేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తద్వారా హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికే అని సీఎం పరోక్షంగా ప్రకటించినట్లయింది. అలాగే,

ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయినా..

ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయినా..

ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాలు కొనసాగించామని, ఎన్టీఆర్ అవకాశమిస్తే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేశారని, 1969 ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని నడిపించారన్న కేసీఆర్.. ఎంత చేసినా అప్పటి పాలకులు తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. రాజకీయాలు జరుగుతుంటాయని, ఏ ఎన్నికలోనైనా గెలుపు ఓటములు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. తెలంగాణ చాలా కష్టపడి సాధించిన రాష్ట్రమేకానీ, ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదని, ఎప్పుడూ ఒకరే అధికారంలో ఉండబోరని, కాంట్రిబ్యూషన్ మాత్రం ఉంటుందని కేసీఆర్ అన్నారు.

ఆంధ్రా కాదు.. హైదరాబాదీ అనాలి

ఆంధ్రా కాదు.. హైదరాబాదీ అనాలి

తెలంగాణలో అమలవుతోన్న ప్రతి పథకం వెనుక లోతైన విశ్లేషణ ఉంది. ఉదాహరణకు గొర్రెల పంపిణీ స్కీమ్ ఉత్తుత్తిది కాదు. ఇప్పుడు గొర్రెల ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ టాప్. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు. తెలంగాణ రైతులు నేడు 3 కోట్ల టన్నుల వడ్లు పండించారు. మాకు కులం మతం జాతి లేదు. పేదరిక నిర్ములన దిశగా పోతున్నాం. రైతు బంధు వల్ల రైతులంతా ఇప్పుడు ధీమాతో ఉన్నారు. ఇప్పడు ఎవడేం పీకినా తెలంగాణలో కరెంటు పోదు. ఇక్కడుండే ప్రతి మనిషి చిరునవ్వు తో బతకాలి. ఆంధ్ర వాళ్ళు కాదు.. హైదరాబాది అని చెప్పుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెక్కిరించారు. వ్యక్తిగతంగా నన్ను, నా శరీర భాగాలనూ కించపరిచేలా నానా మాటలు అన్నారు " అని కేసీఆర్ గుర్తుచేశారు.

Recommended Video

KCR was misleading the people of Telangana in the name of land auction -Revanth Reddy
కుక్కల్లా మొరగొద్దు, హైబీపీ వద్దు..

కుక్కల్లా మొరగొద్దు, హైబీపీ వద్దు..


కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా తలపెట్టిన దళిత బంధు పథకంపై విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. "దేవుడు నోరు ఇచ్చాడని కుక్కలు మోరిగినట్టు మొరుగుతారా? ఎన్నికలతో సంబంధం లేకుండా మేము అభివృద్ధి చేస్తూ మేము వెళ్తున్నాం. అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. దేశంలో దళితులు అణచివేతకు గురయ్యారు. దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన దళిత బంధు పథకం చూసి కొంత మంది బ్లెడ్ ప్రెషర్ పెరుగుతుంది" అని కేసీఆర్ మండిపడ్డారు.

English summary
amid huzurabad assembly by election, expelled congress leader padi kaushik reddy joins trs on wednesday. trs chief and telangana cm kcr welcomes kaushik reddy into party. speaking at joining event, cm kcr made interesting comments on andhra people, winning and losing in politics and kaushik reddy family background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X