హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిల్లర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌: రెండేళ్ల సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని, వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు పడుతామని,ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సిఎస్టీ పన్ను బకాయిని సీఎం రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని సిఎం పునరుద్ఘాటించారు.

వివరాల్లోకి వెలితే...
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సి- ఫారం దాఖలు చేస్తే (సిఎస్టీ) టాక్స్ లో 2 శాతం రాయితీని కల్పించే విధానం ఉండేది. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభంలో అమలయ్యింది. కాగా... 01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి- ఫారం సబ్మిట్ చేయలేదనే కారణం చేత బియ్యం ఎగుమతి దారులకు సిఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కల్పించడం నిలిపివేయడం జరిగింది.

 CM KCR good news for millers: two years CST cancelled

కాగా, సీ ఫారం సబ్మిట్ చేయలేదనే పేరుతో తెలంగాణ రైస్ మిల్లర్లకు 2 శాతం పన్ను రాయితీని అవకాశాన్ని కల్పించకపోవడం వలన తాము ఆర్థికంగా నష్ట పోతున్నామని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు. బియ్యం ఎగుమతి చేసినమా లేదా అనేది నిర్దారణ చేసుకోవడమే సి ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎట్లా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. సి ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్దారణ చేసుకోవడానికి ఇతర పద్దతులను పరిశీలించాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్, సర్టిఫికేట్లు, లారీలు రైల్వే పర్మిట్లు, వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్ నైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్నును రద్దు చేయాలని కోరారు.

ఇదే విషయాన్ని నేటి దామరచర్ల పర్యటన సందర్భంగా, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడి తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సీఎంను కలిసి విజ్జప్తి చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం, ఇందులో కేవలం తెలంగాణ రైస్ మిల్లర్ల ప్రయోజనమే లేదని, దాంతో పాటు, తెలంగాణ రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి వున్నదనే విషయాన్ని సీఎం గ్రహించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లవుతుందని సిఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

అటు రైస్ మిల్లర్లకు ఇటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగే విధంగా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షున్ని సీఎం ఆదేశించారు. సీఎం గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసిన సందర్భంలో సి ఫారం బదులు అందుకు సామానమైనచ లోడింగ్ సందర్భంగా ఇచ్చే సర్టిపికేట్లు కానీ, బియ్యం అన్ లోడ్ చేస్తున్న సందర్భంగా వుండే కాయితాలు, వే బిల్లులు, లారీలు రైల్వే ల ద్వారా చేసే రవాణా పర్మిట్లకు సంబంధించిన కాయితాలు, తదితర సంబంధిత పర్మిట్ సర్టిఫికేట్లు ఏవి వున్నా వాటిని సబ్మిట్ చేసి తాము ఎగుమతి చేసినట్టు నిర్థారించుకుంటే వాటిని సి ఫారం ప్లేస్ లో పరిగణలోకి తీసుకోవచ్చునని, ఈ నేపథ్యంలో 01.04.2015 నుంచి 30.06.2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2 శాతం పన్నును రద్దు చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం గారి ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేసింది.

తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎంను సోమవారం ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శన

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పెర్కోన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి... ప్రైవేట్ కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బిహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి, మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తొలుత రెండు హెలికాప్టర్ లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మధ్యాహ్నం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలికి సీఎం చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి పవర్ ప్లాంట్ ఫేజ్-1, యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండవ ఫ్లోర్ కు చేరుకొని ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ట్రాన్స్ కో, జెన్ కో, బిహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకన్నారు. అధికారులు పవర్ ప్లాంట్ గురించి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవర్ ప్లాంట్ కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబందిచిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా నిళ్ళను సరఫరా చేసేవిధంగా ఏర్పట్లు చేసుకోవాలని సూచించారు.

English summary
CM KCR good news for millers: two years CST cancelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X