• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక నిర్ణయం దిశగా సీఎం కేసీఆర్ : మంత్రులు- నేతలకు పిలుపు : ఇక తేల్చుడే..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తన నిర్ణయానికి ముందు పార్టీ ముఖ్యులు..మంత్రులతో కీలక భేటీకి నిర్ణయించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా డిసైడ అయిన కేసీఆర్ తగిన వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా బెంగుళూరులో మాజీ ప్రధాని దేవగౌడ..మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో భేటీ తరువాత ..కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు - మూడు నెలల్లో సంచలన ప్రకటన ఉంటుందంటూ మరింత ఆసక్తి పెంచారు.

సీఎం కేసీఆర్ కీలక భేటీ వెనుక

సీఎం కేసీఆర్ కీలక భేటీ వెనుక

కొద్ది రోజులుగా ఫాం హౌస్ కు పరిమితమైన కేసీఆర్..ఈ కీలక భేటీ ఏర్పాటు వెనుక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు అటు కేంద్రంలోని ముఖ్యులు.. ఇటు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్ధుల పైన కసరత్తు పూర్తి చేసారు. ఆప్షన్లు సిద్దం చేసుకున్నారు. ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్ధిని ఖరారు చేసిన తరువాత తమ నిర్ణయం ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మద్దతు కోరుతూ పలు పార్టీలతో ప్రాధమికంగా చర్చలు జరిగాయి. అయితే, ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు కేసీఆర్ కీలకంగా మారారు.

రాష్ట్రపతి ఎన్నికలు - టీఆర్ఎస్ పాత్ర

రాష్ట్రపతి ఎన్నికలు - టీఆర్ఎస్ పాత్ర

ఆయన ఇప్పటికే శివసేన..ఎన్సీపీ..డీఎంకే..జేడీఎస్.. జేఎంఎం..ఆప్ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా నిర్ణయించారు. దీంతో..సీఎం కేసీఆర్ నేటి సమావేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించి..రాష్ట్రపతి ఎన్నికల వేళ తన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపాదించే అభ్యర్ధికి మద్దతిస్తారా లేదా అనేది నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రులతో పాటుగా పార్టీ విప్ లు.. పార్లమెంటరీ పార్టీ నేతలను సైతం ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం.

మద్దతు ఎవరికి - ప్రకటనకు ఛాన్స్

మద్దతు ఎవరికి - ప్రకటనకు ఛాన్స్

జాతీయ నేతల నుంచి వస్తున్న ప్రతిపాదనలు.. అభ్యర్ధనలు..తన ఆలోచనలను సీఎం కేసీఆర్ వారితో పంచుకొని..వారి అభిప్రాయాలను సైతం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రభుత్వం పైన ఆరోపణలకు..అసాంఘిక చర్యలకు కారణంగా నిలుస్తున్న పబ్ ల విషయంలో కఠినంగా వ్యవహించాలని సీఎం నిర్ణయంగా విశ్వసనీయ సమాచారం. వీటి నిర్వహణ పైన సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అధికార పార్టీ నేతల్లో ప్రచారం సాగుతోంది. మంత్రులు..పార్టీ ముఖ్యులతో సమావేశం లో ఇప్పుడు సీఎం కేసీఆర్ రాజకీయంగా.. పాలనా పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.

English summary
CM KCR decided to conduct meeting with ministers and aprty key leaders, may announce key decisions on President elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X