కేంద్రమంత్రి రవిశంకర్‌తో కేసీఆర్ భేటీ: హైకోర్టు విభజనతోపాటు కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: కొత్త జోనల్ విధానం సహా పలు పెండింగ్ అంశాలపై ప్రధాని సహా, కేంద్రమంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు.
సుమారు 50నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. కేసీఆర్ వెంట వినోద్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా, నాలుగేళ్లు గడుస్తున్నా.. హైకోర్టు విభజన జరగకపోవడంపై కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది.

హైకోర్టు విభజనకు సంబంధించి చొరవ తీసుకోవాలని మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కొత్తగా తీసుకొచ్చిన జోనల్ విధానంపైనా న్యాయశాఖ మంత్రితో చర్చించినట్లు సమాచారం. కాగా, కొత్తగా తీసుకొచ్చిన జోనల్ విధానంపై ప్రధాని మోడీతో శనివారం భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications