మునుగోడులో గెలుపెవరది - ఎవరు ఏ స్థానంలో : సర్వే నివేదికలు తేల్చింది ఇదే..!!

తెలంగాణలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు బై పోల్ కీలకంగా మారింది. ఇక్కడ ఉప ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా..ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి...అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా..తమ బలం చాటుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వామపక్షాల తో పొత్తు ఖరారైంది. అటు కాంగ్రెస్ సైతం ప్రత్యేకంగా మునుగోడు కోసం కష్టపడుతోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో పరిస్థితుల పైన పలు రకాలుగా సర్వేలు చేయించారు.

గులాబీ జెండానే ఎగిరేది

గులాబీ జెండానే ఎగిరేది

వాటి ఫలితాల ను పార్టీ నేతల ముందుంచారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మునుగోడు ఫలితాల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ 200 శాతం విజయం సాధిస్తుందని సర్వేలు స్పష్ట చేస్తున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉండటంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్‌ దక్కే పరిస్థితి కూడా లేదన్నారు.

తాను చేయించిన సర్వేల్లో టీఆర్ఎస్ కు 42 శాతం కు పైగా ఓటింగ్ వస్తుందనేది తేలిందని వివరించారు. అయినా, పార్టీ నుంచి ఉప ఎన్నిక కోసం రెండు గ్రామాలకు ఒక్కో ఎమ్మెల్యేకు చొప్పున బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేసారు. గ్రామాలవారీగా ఇన్‌చార్జి ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తామని వెల్లడించారు.

ఎమ్మెల్యేలకు సమన్వయ బాధ్యతలు

ఎమ్మెల్యేలకు సమన్వయ బాధ్యతలు

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి చెందిన 15 మంది సుశిక్షుతులైన కార్యకర్తల బృందంతో వెళ్లి ఆయా గ్రామాల్లో స్థానిక కేడర్‌తో మమేకమై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ నిర్దేశించారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ముగిశాక మునుగోడు ప్రచారానికి ఎమ్మెల్యేలు వెళ్లాలని ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.

ఈ నెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులతో చెప్పారు. 6న దివంగత సభ్యులకు నివాళి అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయని చెప్పారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారవుతుందన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలను స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో నిర్వహించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

రాజగోపాల్ కు డిపాజిట్ దక్కదంటూ

రాజగోపాల్ కు డిపాజిట్ దక్కదంటూ

డిసెంబర్ చివరినాటికి ప్రతి నియోజకవర్గానికి 3 వేల రెండుపడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేసారు. రైతు సంఘాల నేతల భేటీ తరహాలో త్వరలో జాతీయ స్థాయిలో దళిత సంఘాల ప్రతినిధులతోనూ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి'అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడంలో సఫలమైన బీజేపీకి.. బిహార్, ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో మిమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు జరుగుతాయంటూ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అటువంటి అవకాశం వారికి కల్పించకుండా పని చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+