ఎన్నికల వేళ మహిళలకు ముఖ్యమంత్రి శుభవార్త..!!

తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏ క్షణం అయినా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉంది. ఈ సమయంలోనే అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే టికెట్లు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఎన్నికల వరాల వెల్లడికి సిద్దమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ సీట్ల ఖరారు పైన కుస్తీ పడుతున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ధీటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాల ప్రకటన ఉంటుందన్న నేపథ్యంలో ఉత్కంఠ కొనసగుతోంది.

కేసీఆర్ కీలక నిర్ణయాలు
తెలంగాణ ఎన్నికల సమరంలో హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ సైతం ఈ సారి అధికారం తమదేనని విశ్వాసంతో ఉంది. బీజేపీ మేము సైతం రేసులో అని ముందుడగు వేస్తోంది. తాజాగా ప్రధాని నిజమాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు.

CM KCR to Announce Elections promises

వీటికి మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఇక, ఎన్నికలకు ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ రోజున పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు ముఖ్యమంత్రి ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం.

కాంగ్రెస్ కు ధీటుగా
కాంగ్రెస్ తమ గ్యారంటీ పథకాలతో ప్రకటించిన వాటిలో గ్యాస్ సిలిండర్ పైన రూ 500 సబ్సిడీ అంశం పైన బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ చేసిందని చెబుతున్నారు. అయితే, వంట గ్యాస్ లోనే సబ్సిడీ హీమ ఇస్తారా లేక..ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే అంశం పైన తాజాగా మంత్రి హరీష్ కీలక సమాచారం వెల్లడించారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమ‌లు చేశార‌ని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి ఇలా అనేక ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని గుర్తు చేశారు. త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుంది. మహిళలను మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుందన్నారు.

మేనిఫెస్టోలో ప్రకటన
మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయి. త్వరలో శుభవార్త వింటారని మంత్రి స్ప‌ష్టం చేశారు.ఇప్పటికే అంగన్ వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నియామకంతో పాటుగా 5 శాతం ఐఆర్ ప్రకటించారు.

ఇక, ఉద్యోగుల పెండింగ్ అంశాలపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమయంలోనే మహిళలకు సంబంధించిన ఆర్దిక పరమైన అంశాల్లోనూ ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉంటాయనే మంత్రి హరీష్ ప్రకటనతో...సీఎం నిర్ణయాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+