ఈ నెల 24న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ..!!
బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సిద్దం కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. కొత్త నిర్ణయాలతో రాజకీయంగా వేడి పెంచుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా తొలి అడుగు మహారాష్ట్రలో వేయాలని సీఎం డిసైడ్ అయ్యారు. మహారాష్ట్ర వేదికగా ఇప్పటికే స్పందన పెరగటంతో మరో సారి సభ నిర్వహణకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 24న గాబాద్‌లో లక్షన్నర మందితో మరో భారీ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లో చేరికలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సభకు మంచి స్పందన వచ్చింది. ఆ సభ అనంతరం కేవలం 55 రోజుల వ్యవధిలోనే కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో మార్చి 26న రెండో సభను నిర్వహించారు.

ఈ సభకు నాందేడ్ సభకు మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలి రెండు సభలు దిగ్విజయం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు మరో భారీ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సారి లక్షన్నర మందితో ఔరంగాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మహారాష్ట్ర నడిబొడ్డయిన ఔరంగబాద్‌లో నిర్వహించనుండటంతో బీఆర్ఎస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
కేసీఆర్ ఆ రెండు సభల్లో వివరించిన అంశాలపై ఇప్పుడు మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తున్నది. తాజాగా నాసిక్‌కు చెందిన పలువురు సిట్టింగ్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో, ఔరంగాబాద్ లో ఈ నెల 24న నిర్వహించే సభకు బీఆర్‌ఎస్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఔరంగాబాద్ చేరుకొన్నారు.

కన్నాడ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం ఆధ్వర్యంలో శనివారం భారీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ బీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications