రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం... పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్...
తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం(ఆగస్టు 17) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
సమావేశంలో దళిత బంధు పథకంపై కూడా కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పథకం అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. దళిత బంధును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులకు ఆయన కీలక సూచనలు చేయనున్నారు. దళిత బంధు పథకం అమలుపై అనేక అనుమానాలు,సందేహాలు లేవనెత్తుతున్న వేళ... ప్రజల్లో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాల్సిన అవసరంపై కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్న ఈ పథకం కోసం సోమవారం(ఆగస్టు 23) మరో రూ.500 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే మొదటి విడతలో రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.2వేల కోట్లు ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం వెచ్చించనున్నారు. వారం రోజుల్లోపు మిగతా రూ.1వెయ్యి కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్‌లో సంపూర్ణంగా... మిగతా 118 నియోజకవర్గాల్లో పాక్షికంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మందికి రూ.10లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హుజురాబాద్ నుంచి దీనికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... అక్కడ ప్రతీ దళిత కుటుంబానికి పథకాన్ని అందిస్తామని చెబుతోంది. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజకవర్గంలోని 15 దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెక్కులు అందజేశారు. దళిత బంధు పూర్తిగా సబ్సిడీ పథకమేనని... తిరిగి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరు నూరైనా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామని చెప్పారు. తెలంగాణ దళితులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా వారిని ఆర్థికంగా నిలబెడుతామని పేర్కొన్నారు. నిజానికి ఏడాది కింద ప్రారంభం కావాల్సిన ఈ పథకం... కరోనా వల్ల ఆలస్యమైందని తెలిపారు.
మరోవైపు దళిత బంధు పథకం ఓట్ల బంధు పథకమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతవరకూ ఈ పథకానికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. నిజంగానే కేసీఆర్‌కు దళితుల పట్ల అంత ప్రేమ,వారికి మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే... ఉపఎన్నికకు ముందే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అంతేకాదు,బీసీ,ఎస్టీలకు సైతం ఈ పథకాన్ని అమలుచేయాలని... అందులోని పేదలకు రూ.10లక్షలు చొప్పున అందించాలని డిమాండ్ చేస్తున్నారు.గతంలో దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. దళిత బంధు పథకం కూడా ఆరంభ శూరత్వమే తప్ప... చివరి వరకు కొనసాగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి సాధ్యం కాని పథకాలను తెర మీదకు తెస్తున్నాడని విమర్శిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications