ఆ ఇద్దరిలో ఎవరు..? కొత్త సీఎస్‌గా కేసీఆర్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు..?
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ పదవి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త సీఎస్ ఎంపికకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేటి సాయంత్రం దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శలుగా కొనసాగుతున్న అజయ్ మిశ్రా,సోమేశ్ కుమార్‌ల పేర్లను సీఎస్ పదవి కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
సీనియారిటీ పరంగా చూసుకుంటే అజయ్ మిశ్రాకే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆయన పదవీకాలం వచ్చే జులైతో ముగియనుంది. దాంతో ఒకవేళ అజయ్ మిశ్రాను సీఎస్‌గా నియమించుకుంటే.. మళ్లీ ఏడాది లోపే కొత్త సీఎస్ నియామకం చేపట్టాల్సి వస్తుంది.

మరోవైపు సోమేశ్ కుమార్‌కు 2023 డిసెంబర్ వరకు సర్వీస్ ఉంది. కాబట్టి ఆయన్ను పదవిలో నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అజయ్ మిశ్రాకు బాధ్యతలు అప్పగిస్తారా..? లేక సోమేశ్ కుమార్‌నే నియమిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
నేడు కరీంనగర్ పర్యటనకు వెళ్లనున్న సీఎం.. రాత్రి హైదరాబాద్ చేరుకున్నాక సీఎస్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications