ప్రణబ్‌కు కేసీఆర్ లేఖ: కవిత ఇంటి వద్ద ధర్నా, సెక్షన్ 8తో ఏంకాదని కేకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. జూలై 3వ తేదీన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో హరితహారం ప్రారంభించాలని ఆహ్వానిస్తూ లేఖ రాశారు.
కేంద్రం నుంచి సెక్షన్-8పై సమాచారం లేదు: కేకే
కేంద్ర ప్రభుత్వం నుంచి సెక్షన్-8 పైన ఎలాంటి సమాచారం లేదని రాజ్యసభ సభ్యులు కే కేశవ రావు వేరుగా చెప్పారు. ఏదైనా ఉంటే కేంద్ర హోంశాఖ, గవర్నర్ మాట్లాడతారమన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్‌తో మాట్లాడి అడ్డంగా దొరికిపోయారన్నారు. ఈ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. విచారణలో తమ పార్టీ జోక్యం చేసుకోదని చెప్పారు.
తెలంగాణలో దొంగతనాలు కుట్రలు చేసే వాళ్లను వదలమన్నారు. ఏసీబీ విచారణలో తెరాస జోక్యం చేసుకోదన్నారు. దొంగలను పట్టుకోవద్దని సెక్షన్ 8లో లేదని చెప్పారు. కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు సెక్షన్ 8 నాటకం. కేబుల్ యాక్ట్ ప్రకారం టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. సెక్షన్ 8తో ఏమీ కాదన్నారు.
తెలంగాణలో దొంగతనాలు కుట్రలు చేసే వాళ్లను వదలమన్నారు. తెలంగాణ కేబినెట్‌ను కాదని గవర్నర్ నిర్ణయాలు తీసుకోరన్నారు. పోలీసుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పారు. టేపుల్లో గొంతు చంద్రబాబుది కాకుంటే ఎందుకు ఇంత రాద్ధాంతమని ప్రశ్నించారు.

కవిత ఇంటి వద్ద విద్యార్థుల ధర్నా
తెలంగాణ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ నిజామాబాద్‌లోని ఆమె ఇంటి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కేసీఆర్‌కే తెలియదు: తమ్మినేని
కేజీ టు పీజీ విద్య ఎప్పుడు ప్రారంభిస్తారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే తెలియదని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు అన్ని పాఠశాలలో పరిశీలిస్తామని చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్ 8 పైన విస్తృతస్థాయి చర్చ జరగాలన్నారు.
గవర్నర్ చేతికి అధికారాలు ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. ఇద్దరు సీఎంలు కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications