కేటీఆర్ కు సీఎం రమేశ్ ఘాటు కౌంటర్- కవితను వదిలేస్తే విలీనం ? నన్ను కెలకొద్దు..!

తెలంగాణలో రూ.1660 కోట్ల మేర నామినేషన్ పై తనకు సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ గతంలో తనను బీఆర్ఎస్ విలీనం కోసం ఎలా బతిమాలుకున్నారో, కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాల్ని గుర్తుచేస్తూ భారీ కౌంటర్ ఇచ్చారు. తనను కెలకొద్దంటూ చివర్లో కేటీఆర్ కు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు.

రేవంత్ సర్కార్ తనకు నామినేషన్ పై పనులు కట్టబెట్టిందంటూ కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన సీఎం రమేశ్ తనకు ఎలాంటి కాంట్రాక్టులూ దక్కలేదని, తన సంస్థ రుత్విక్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడి కాంట్రాక్టు దక్కించుకుందని సీఎం రమేశ్ వెల్లడించారు. దీనిపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వమన్నారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి నేను కాంట్రాక్ట్ పొందాను అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

cm Ramesh strong counter to ktr s remarks offered to merge brs in bjp if leave kavitha

ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెమ్మ షర్మిలతో పోరు ఉన్నట్టే తెలంగాణలో నీకు కూడా చెల్లెలిపోరుతో పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నావంటూ కేటీఆర్ పై సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని ప్రశ్నించారు. నువ్వు నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు మాట్లాడావో గుర్తుందా అని అడిగారు. కావాలంటే నువ్వు వచ్చి వెళ్లిన సీసీటీవీ పుటేజి కూడా మీడియాకు పంపిస్తానన్నారు.

మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపి పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు అవునా? కాదా? అని కేటీఆర్ ను అడిగారు. తాను బీజేపీ పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని, కావున మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణ చేస్తున్నావ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో మీ పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా అని ప్రశ్నించారు.

తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదని. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా? అని సీఎం రమేశ్ సూటిగా ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి టిడిపి పొత్తుతో పని చేస్తాయని అప్పుడు టిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి నిరాధార ఆరోపణలు చూస్తున్నావన్నారు.

cm Ramesh strong counter to ktr s remarks offered to merge brs in bjp if leave kavitha

మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎం రమేశ్ తెలిపారు. దమ్ముంటే రండి మీరు చెప్పిన చోటికి తెలంగాణ భవన్ అయనా పర్లేదు ప్రెస్ క్లబ్బు అయిన పర్లేదు హైదరాబాదులో ఎక్కడైనా సరే నేను వస్తాను మీడియా సమక్షంలో బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అనవసరంగా తనను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+