కొత్త రేషన్ కార్డులు పొందాలంటే - అర్హతలు, మార్గదర్శకాలు ఖరారు...!!

కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ముందుగా అర్హతలు .. దరఖాస్తు ప్రక్రియ పైన ఇప్పటికే సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అర్హతల విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని భావిస్తున్నారు. అదే విధంగా ఫిజికల్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయిన ట్లు తెలుస్తోంది. ఇక, దరఖాస్తుల స్వీకరణ విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయంతో
తెలంగాణ మంత్రివర్గ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీ పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందించే విధంగా మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

CM Revanth announces that new ration cards will be issue from 26th Guide lines to finalise

దరఖాస్తుల స్వీకరణ
గ్రామ - బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్కడే విచారణ చేసి.. ఈ నెల 26వ తేదీ నుంచి జారీ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక, ఆఫ్ లైన్ విధానంలోనే కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా సమాచారం. అదే విధంగా అర్హతల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాలని ప్రభుత్వ తాజా నిర్ణయంగా సమాచారం. గతంలో రేషన్‌ కార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో జారీ చేశారు. కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కార్డులను ఫిజికల్ గానే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్గదర్శకాలు
కొత్త కార్డుల జారీ సమయంలోనే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు ల్లో మార్పులు.. కొత్తగా వివాహం అయిన దంపతులుకు కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పేర్ల మార్పులు, చేర్పుల కోసం దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ఖరారు చేసేందుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు తో చర్చించి, తుది మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో, ఒకటి రెండు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+